నాగబాబు మాస్టర్ ప్లాన్‌తో జబర్ధస్త్‌కు కష్టాలు.. షో రేటింగ్స్‌కు దెబ్బ పడినట్లే.!

By Manoj

సాధారణంగా సినీ పరిశ్రమలో పోటీతత్వం ఎక్కువగా కనిపిస్తుంది. తమ సినిమానే బాగా ఆడాలనో.. రికార్డు బద్దలు కొట్టాలనో.. కలెక్షన్లు రాబట్టాలనో.. ఇలా ఎన్నో రకాలుగా ఫిల్మ్ మేకర్లు ప్లాన్లు వేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇదే తరహా ట్రెండ్ బుల్లితెరపైనా కనిపిస్తోంది. వినోద కార్యక్రమాలు ఎక్కువవుతున్న తరుణంలో నిర్వహకులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. తాజాగా ఇదే ఫాలో అవుతున్నారట మెగా బ్రదర్ నాగబాబు. ఆయన జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న 'అదిరింది' షో కోసం మాస్టర్ ప్లాన్ వేశారట. దీంతో జబర్ధస్త్‌కు కష్టాలే అని అంటున్నారు. ఆ వివరాలు మీకోసం.!

 బుల్లితెరపై తిరుగులేని షో.. రికార్డులు సొంతం

బుల్లితెరపై తిరుగులేని షో.. రికార్డులు సొంతం

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షోలలో జబర్ధస్త్ ఒకటి. కామెడీ స్కిట్లతో రన్ అయ్యే ఈ షో... ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే టీఆర్పీ రేటింగ్ విషయంలో కానీ, యూట్యూబ్ వ్యూస్ విషయంలో గానీ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అలాగే, ఎంతో మందిని పరిశ్రమకు పరిచయం చేసింది.

నిలబెట్టిన వ్యక్తే షాకిచ్చాడు.. ఎఫెక్ట్ పడలేదు

నిలబెట్టిన వ్యక్తే షాకిచ్చాడు.. ఎఫెక్ట్ పడలేదు

జబర్ధస్త్ షో ప్రారంభం నుంచి మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. షో విజయంలో వాళ్ల పాత్రను నిర్వర్తించారు. ఇలాంటి తరుణంలో నాగబాబు.. జబర్ధస్త్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. దీంతో షోపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా విజయవంతంగా ప్రసారం అవుతోందీ కామెడీ షో.

నాగబాబుతో ఆ టీమ్ లీడర్లు కూడా కలిశారు

నాగబాబుతో ఆ టీమ్ లీడర్లు కూడా కలిశారు

జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత నాగబాబు... షో నిర్వహకులపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఇందుకోసం కొన్ని వీడియోలను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత మరో ఛానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ‘అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించారు. ఆ సమయంలో జబర్ధస్త్‌కు చెందిన చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ టీమ్‌లు కూడా అందులో చేరిపోయాయి.

ఇక్కడ టచ్ చేయలేదు.. అక్కడ మాత్రం పర్లేదు

ఇక్కడ టచ్ చేయలేదు.. అక్కడ మాత్రం పర్లేదు

అదిరింది షో ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. ఇందులో చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, వేణు, ధన్‌రాజ్, సద్దాం టీమ్‌లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ... షో ప్రారంభంలో ఏమాత్రం మంచి రేటింగ్‌ను సాధించలేకపోయాయి. కానీ, వారాలు గడుస్తున్న కొద్దీ ఆ షోకు కూడా మంచి స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ‘అదిరింది' స్కిట్లకు వ్యూస్ బాగా వస్తున్నాయి.

జబర్ధస్త్‌ను కొట్టేసేందుకు నాగబాబు మాస్టర్ ప్లాన్‌

జబర్ధస్త్‌ను కొట్టేసేందుకు నాగబాబు మాస్టర్ ప్లాన్‌

ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, యూట్యూబ్‌లో భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్న తరుణంలో కరోనా వైరస్ ‘అదిరింది' షోకు దెబ్బకొట్టింది. పుంజుకుంటున్న తరుణంలో ప్రసారం నిలిచిపోవడంతో షో నిర్వహకులు ఢీలా పడ్డారు. లాక్‌డౌన్ అనంతరం జబర్ధస్త్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు రేటింగ్‌ను మెరుగుపరుచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం నాగబాబు మాస్టర్ ప్లాన్ వేశారట.

Recommended Video

#HBDSudigaliSudheer : Sudigali Sudheer Next Film with Rashmi Gautam
 అదిరిపోయే ప్లాన్‌తో జబర్ధస్త్‌కు కష్టాలేనట

అదిరిపోయే ప్లాన్‌తో జబర్ధస్త్‌కు కష్టాలేనట

తాజా సమాచారం ప్రకారం... లాక్‌డౌన్ తర్వాత ‘అదిరింది' షోను వారంలో రెండు రోజులు ప్రసారం చేయాలని నిర్ణయించారట. ఈ ప్లాన్‌ను నాగబాబు నిర్వహకుల ముందు ఉంచాడని తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే జబర్ధస్త్‌ షోకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా.. జబర్ధస్త్ రెండు రోజులు ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X