మీకు ఆ దమ్ముందా? జబర్దస్త్‌కు ధీటుగా.. సవాల్ విసిరిన నాగబాబు

కరోనా లాక్‌డౌన్‌లో అనేక విషయాలపై సంచలన రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కాస్త వివాదాలు, కాస్త వినోదంతో నా ఇష్టం నా ఛానెల్‌లో హడావిడి చేస్తున్న నాగబాబు మరోసారి ఆసక్తికరమైన సమాచారంతో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జబర్దస్త్‌ను వీడిన నాగబాబు ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల తర్వాత అదిరింది షోతో బిజీగా మారారు. ఈ నేపథ్యంలో మరో రెండు షోలను ప్రారంభించేందుకు నాగబాబు టీమ్ సిద్దమయ్యారు. ఆ విషయాల గురించి నాగబాబు మాట్లాడుతూ..

టాలెంటెడ్ కమెడియన్ల కోసం వేట

టాలెంటెడ్ కమెడియన్ల కోసం వేట

సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రతిభకు ప్రోత్సాహం కరువైంది. టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లభించడం లేదు అనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే అలాంటి టాలెంట్ ఉండి అవకాశాలు చేజిక్కించుకోలేకపోతున్న యువ ఆర్టిస్టులకు తాను చక్కటి అవకాశం కల్పించబోతున్నాను. త్వరలోనే తాను చేయబోయే రెండు షోలకు ప్రతిభావంతుల కోసం వేట మొదలుపెట్టాం అని నాగబాబు తెలిపారు.

మీకు ఇదే నా ఛాలెంజ్

మీకు ఇదే నా ఛాలెంజ్

జబర్దస్త్, అదిరింది లాంటి టెలివిజన్ షోలలో ఎంట్రీ లభించడం లేదని ఆవేదన చెందుతున్న ప్రతిభావంతులకు ఛాలెంజ్ విసురుతున్నాం. నాలాంటి వాళ్లను నవ్వించే సత్తా, దమ్ము ఉన్న వ్యక్తులకు అవకాశం ఆఫర్ ఇస్తాం. మేము రెండు రకాల షోలు చేయబోతున్నాం. అదిరింది మాదిరి లాంటి స్కిట్, స్టాండప్ కామెడీ షోలను ప్రారంభించబోతున్నాం. టాలెంట్ ఉన్న వారికి ఆ రెండు షోలలో అవకాశాలు ఇవ్వాలని టాలెంట్ హంట్ చేస్తున్నాం అని నాగబాబు తెలిపారు.

ఇద్దరు కమెడియన్లు హోస్టులుగా

ఇద్దరు కమెడియన్లు హోస్టులుగా

ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే రెండు షోలకు సంబంధించిన వివరాలను ఇద్దరు ప్రముఖ కమెడియన్లు వెల్లడిస్తారు. ఆ ఇద్దరు కమెడియన్లు వెల్లడిస్తారు. ఆ రెండు షోలకు సంబంధించిన నియమ నిబంధనలు వెల్లడిస్తారు. ఆ రూల్స్‌కు అనుగుణంగా వారు పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది అని నాగబాబు పేర్కొన్నారు.

ఓటీటీలో రెండు షోల కోసం

ఓటీటీలో రెండు షోల కోసం

రెండు షోల కోసం జరిగే ఎంపిక పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రారంభించబోయే షోలో అవకాశం లభిస్తాయనే హామీ ఇస్తున్నాను. దాంతో వారికి ప్రతిఫలంతోపాటు వైడ్ రేంజ్ పాపులారిటీ లభిస్తుంది. కాబట్టి ప్రతిభ ఉన్న వారు ఈ పోటీలకు సిద్దం కావాలని కోరుకొంటున్నాను. ఒకట్రెండు రోజుల్లో ప్రముఖ కమెడియన్లు వివరాలను ప్రకటిస్తారు అని నాగబాబు తెలిపారు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
అలాంటి వాటికి మేము వ్యతిరేకం

అలాంటి వాటికి మేము వ్యతిరేకం

సాధారణంగా ఇలాంటి పోటీలకు ఎంటీ ఫ్రీజు వసూలు చేస్తారు. కానీ అలాంటి ఫీజలు వసూలు చేయడానికి మేము వ్యతిరేకం. ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా పోటీలో పాల్గొనేలా ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తున్నాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని నా ఇష్టం నా ఛానెల్‌ను చూసూ ఉండండి అంటూ నాగబాబు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X