సుడిగాలి సుధీర్ పరువు తీసిన నాగబాబు: అలాంటి పనుల కోసమే ఆ ఛానెల్‌లో మానేశావా అంటూ!

తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని బిగ్ సెలెబ్రిటీగా మారిపోయాడు టెలివిజన్ ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా మొదలైన అతడి ప్రస్థానం.. చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దీంతో సినిమాల్లోనూ ఈ చిన్నోడు సత్తా చాటుతున్నాడు. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సుధీర్.. ఈటీవీని వీడి స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తాజాగా అతడిపై ఊహించని వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌తో సుధీర్ కెరీర్ సక్సెస్‌

జబర్ధస్త్‌తో సుధీర్ కెరీర్ సక్సెస్‌


మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుధీర్.. ఎన్నో ఈవెంట్లు, షోలలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ సహాయంతో ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే తన స్టామినాను చూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటి నుంచి అతడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగింది.

ఆమె ట్రాక్‌తో మరింత ఫేమస్

ఆమె ట్రాక్‌తో మరింత ఫేమస్

తక్కువ సమయంలోనే సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని ప్రచారం జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే.

సినిమాల్లోనూ సత్తా... హీరోగానే

సినిమాల్లోనూ సత్తా... హీరోగానే


సుధీర్ బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' నిరాశ పరిచాయి. ఇప్పుడు సుధీర్ హీరోగా ‘కాలింగ్ సహస్రా', ‘గాలోడు' వంటి చిత్రాలు చేస్తున్నాడు.

ఈటీవీకి గుడ్‌బై చెప్పిన సుధీర్

ఈటీవీకి గుడ్‌బై చెప్పిన సుధీర్

దాదాపు ఆరేడేళ్లుగా ఈటీవీలో ప్రసారం అయిన జబర్ధస్త్ షోలో సందడి చేసిన సుడిగాలి సుధీర్.. ఇటీవలే దాని నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజలు పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో పాల్గొన్న అతడు.. ఇటీవలే దానికి కూడా గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు, మొత్తంగా అతడు ఈటీవీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

స్టార్ మా ఎంట్రీ.. యాంకర్‌గా

స్టార్ మా ఎంట్రీ.. యాంకర్‌గా

ఈటీవీకి గుడ్‌బై చెప్పిన సుడిగాలి సుధీర్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ప్రసారం అవుతోన్న ‘సూపర్ సింగర్ జూనియర్' షోకు అతడు యాంకర్‌గా చేస్తున్నాడు. సుధీర్‌తో పాటు ఈ షోకు అనసూయ భరద్వాజ్ కూడా హోస్టుగా చేస్తోంది. ఈ షోనే కాదు.. భవిష్యత్‌లో సుధీర్ మరిన్ని కార్యక్రమాలను కూడా ఇందులో చేయబోతున్నట్లు టాక్.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
సుధీర్‌కు నాగబాబు స్వాగతం

సుధీర్‌కు నాగబాబు స్వాగతం

స్టార్ మాలో వచ్చే ఆదివారం ‘పార్టీ చేద్దాం పుష్ప' అనే స్పెషల్ ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి హోస్టుగా సుడిగాలి సుధీర్ వ్యవహరించబోతున్నాడు. అలాగే, మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్‌గా రాబోతున్నాడు. ఇందులో డ్యాన్స్‌లు, పాటలు, కామెడీ స్కీట్లు చేయబోతున్నారు. అనసూయ కూడా దీనికి రాబోతుంది. ఈ కార్యక్రమం ద్వారా సుధీర్‌కు నాగబాబు స్టార్‌ మాలోకి స్వాగతం పలికారు.

సుధీర్ పరవు తీసిన నాగబాబు


‘పార్టీ చేద్దాం పుష్ప' ఈవెంట్‌లో నాగబాబుకు సుధీర్ వెల్‌కం అని చెప్పగానే ‘ఎవరు ఎవరికి వెల్‌కం' చెప్తున్నారురా అని పంచ్ వేశారు. ఆ తర్వాత కూడా అతడిపై సెటైర్లు కంటిన్యూ చేశారు. ఒక సందర్భంలో అమ్మాయిల పిచ్చోడిలా తనపై తాను సుధీర్ పంచ్ వేసుకున్నాడు. అప్పుడు నాగబాబు ‘ఈ పనుల కోసమే అక్కడి (జబర్ధస్త్) నుంచి ఇక్కడకు వచ్చావా' అని పరువు తీశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X