Naga Panchami: మోక్షతో కలవాలని కరాళీ.. పంచమితో పిల్లల్ని కనాలని ఫణీంద్ర.. ఏం జరగబోతుంది?
Naga Panchami December 18th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోరుజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. గత ఎపిసోడ్ లోనే అద్భుతైన ట్విస్ట్ ఇవ్వగా... తాజాగా రాబోయే ఎపిసోడ్ లోనూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లా నాగ దేవత పంచమికి విధించిన శాపం.. మోక్షను చంపే బాధ్యతను వేరే వాళ్లకు అప్పగించిన తీరు గురించి కూడా పంచమి మోక్షకు వివరించింది. ఈక్రమంలోనే మోక్ష తనకు వేరే పాముల చేతుల్లో చనిపోవాలని లేదని.. కనీసం నీ ఒళ్లో కన్ను మూస్తేనైనా నాకు ప్రశాంతంగా ఉంటుందని అంటాడు. కానీ పంచమి మాత్రం అలా కాదు మోక్ష బాబు.. నేను అలా చేస్తే ఓడిపోయినట్లే.. కానీ అలా జరగాలని నేను కోరుకోవట్లేదని వివరిస్తుంది.
ఇక ఆ తర్వాత నాగ దేవత కనిపిస్తుంది. ఫణీంద్ర ఆమెను దర్శించుకుంటాడు. ఈక్రమంలోనే పంచమికి నాగ లోకం రావడం ఏమాత్రం ఇష్టం లేదని ఫణీంద్రతో చెబుతుంది. ఇక ఆమె మీద ఆశలు పెట్టుకోవడం కూడా వ్యర్థమేనని అంటుంది. అయితే మోక్షను చంపే బాధ్యత తన నుంచి తీసేసుకున్నట్లు కూడా తనకు చెప్పానని... ఇక ఆ బాధ్యతను నువ్వే తీసుకోవాలని ఫణీంద్రకు వివరిస్తుంది. వచ్చే ముక్కోటి ఏకాదశి రోజు నువ్వు భూలోకానికి వెళ్లి మోక్షను ప్రాణాలు తీయాలని ఆజ్ఞాపిస్తుంది. అలాగే ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి నాగమణికి పూజ చేయాలని.. అందుకు రాణీ రక్తమే కావాలని అంటుంది. దాని వల్లే మనకు శక్తి లభిస్తుందని కానీ ఆ పూజ చేసేందుకు పంచమి ఏమాత్రం ఒప్పుకునేలా కనిపించట్లేదని నాగ దేవత ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అదంతా తెలుసుకున్న ఫణీంద్ర.. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని అడగ్గానే.. ఒకటి ఉంది. కానీ అది జరగదని నాగ దేవత చెబుతుంది. అదేంటో చెప్పండి మాత నా వల్ల అయ్యేలా చేస్తానని అనగానే... పంచమి పాముగా మారినప్పుడు ఆమెతో కలిసి ఆమె గర్భవతి అయ్యేలా చేస్తే పుట్టిన పిల్లలకు రాణీ పీఠం దక్కుతుందని అంటుంది. కానీ నువ్వు అలా చేయగలవా అనగానే.. మోక్ష ఉన్నంత కాలం అలా చేయలేను అతడిని చంపాకే.. మిగిలిన కార్యాన్ని నెరవేరుస్తానని అంటాడు. ఆ తర్వాత నాగ దేవత ఇష్ట కార్యార్థ సిద్ధిరిస్తూ అని దీవించగానే ఫణీంద్ర పాముగా మారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక ఆ తర్వాత కరాళీ కనిపిస్తుంది. రూపం మార్చుకున్న ఆమె అద్దంలో తన రూపం చూసుకుని మురిసిపోతుంది. ఎలాగైనా మోక్షతో కలిసి శక్తులు పొందాలని.. ముఖ్యంగా అతడిని అడ్డం పెట్టుకునే నాగమణిని పొందాలని అనుకుంటుంది. ఈక్రమంలోనే నంబూద్రీ ఆత్మ అక్కడకు వస్తుంది. వెంటనే అన్నను చూసిన కరాళీ.. త్వరలోనే నాగ మణిని సంపాధించి మీ ప్రాణాలను కాపాడుతానని... అందుకే ఈ రూపం పొందానని అంటుంది. ఓవైపు మీ శరీరం పాడువుతుందనే బాధ ఉందని.. త్వరలోనే నాగమణిని సంపాధించి ఆ తర్వాతే మీకు కనిపస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మోక్ష తల్లికి ఫోన్ చేసి తాను కేరళ వెళ్లానని... తన లగేజీని ఎవరోతైనా పంపించమని చెబుతుంది.
కరాళీతో ఫోన్ మాట్లాడడం విన్న మోక్ష.. అమ్మా మోహిని నంబూద్రీ గారి చెల్లెలు అని నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు. కుటుంబ సభ్యులు అంతా షాకవుతారు. ఆ పిల్ల చాలా మంచిదని.. మోహిని ఇక్కడే ఇంకా కొంత కాలం ఉంటే బాగుండు అంటూ అంతా అనుకుంటారు. మోక్ష కూడా తను ఇక్కడే ఇంకా కొంత కాలం ఉంటే నా రీసర్చ్ కు చాలా బాగా పనికొచ్చేది అంటాడు. ఆ తర్వాత చిత్ర, జ్వాలలు మాకు ఎవరూ విలువ ఇవ్వట్లేదంటూ గొడవ చేయగా... మోహిని లగేజి సర్దుపోండని అత్తగారు చెబుతారు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది.
అయితే రేపటి ఎపిసోడ్ లో చిత్ర, జ్వాలలు మోహిని గదిలికో వెళ్లగా.. అక్కడ ఆమె పూజలు చేసినవి కనిపిస్తాయి. వాటిని చూసి వారు భయపడుతూ ఉంటారు. అలాగే గుడికి వెళ్లిన పంచమికి ఫణీంద్ర కనిపిస్తాడు. మోక్షను బతికించుకోవడానికి ఏదైనా మార్గం ఉందని అని అడగ్గానే.. ఏమీ లేదు ఆయన ప్రాణాలు కోల్పోవడం ఖాయం అని చెబుతాడు. అలాగే మనిద్దరి పాములుగా మారాక సంభోగిస్తే పుట్టే పిల్లలకు రాణీ వాసం దక్కుతుందని అంటాడు. అదంతా చాటుగా ఉండి వింటుంది కరాళీ. ఇక ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











