బిగ్ బాస్ షోకు షాక్.. మూడు వారాల పాటు నాగార్జున దూరం.. ఆ వీడియోతో క్లారిటీ!!
బిగ్‌బాస్ షో అంటే కమిట్మెంట్ ఉంటుంది. హోస్టింగ్ విషయంలో మరింత కచ్చితంగా ఉండాల్సి వస్తుంది. బిగ్ బాస్ షో నడిచినంత కాలంలో అందుబాటులో ఉండాల్సిందే. కానీ నాగార్జున మాత్రం ప్రతీసారి షోకు దూరంగానే ఉంటున్నాడు. మూడో సీజన్‌లోనూ నాగార్జున తన బర్త్ డే వేడుకల్లో భాగంగా ఓ వారం హోస్టింగ్‌కు దూరమయ్యాడు. ఆ రెండు రోజులు నాగార్జున బదులు రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ఈ నాల్గో సీజన్‌లోనూ మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కానుందని తెలుస్తోంది.

సమంత హోస్ట్..
మామూలుగా దసరా స్పెషల్‌గా ఈ వీకెండ్‌ను సమంత హోస్ట్ చేయబోతోంది. ఈ మేరకు వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంకొన్ని గంటలు ఆగితే ఆ వార్తలు నిజమో కాదోనన్న సంగతి తెలుస్తుంది. ఎలాగూ ప్రోమోలతో బిగ్ బాస్ టీం రచ్చ రచ్చ చేస్తుంది. అయితే ఇంత లోపే నాగార్జున మాత్రం ఓ హింట్ ఇచ్చేశాడు.

వైల్డ్ డాగ్ షూటింగ్..
నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ వారం మొత్తం అక్కడే ఉన్నాడు. అలీ రెజా షూటింగ్ జరుగుతున్న వీడియోలను, నాగార్జున ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నాడు. నాగ్ ప్రస్తుతం మనాలి దగ్గరున్న రోహ్తంగ్ పాస్‌లో షూటింగ్ చేస్తున్నాడు. తాజాగా నాగార్జున ఓ వీడియోను షేర్ చేశాడు.

మూడు వారాల పాట..
ఈ వీడియోలో నాగార్జున.. ‘నేను రోహ్తాంగ్ పాస్‌లో ఉన్నాను.. ప్రస్తుతం 13000 అడుగుల ఎత్తులో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉన్నాను. ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైనది అని నవంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఉంచుతారు అని తెలిపాడు. ఇక్కడ మరో 21 రోజుల పాటు షూటింగ్ చేస్తాను' అని చెప్పేశాడు.

బిగ్ బాస్ హోస్టింగ్ ఎవరో?
మూడు వారాల పాటు అక్కడే ఉంటానని నాగ్ వీడియోలో చెప్పడంతో బిగ్ బాస్ హోస్ట్ ఎవరన్న ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి. ఈ వారానికి సమంత హోస్ట్‌గా రాబోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి మిగతా రెండు మూడు వారాలకు హోస్ట్‌గా ఎవరు వస్తారో అని అంతా భావిస్తున్నారు.
Recommended Video

వచ్చి వెళ్తాడట..
అయితే ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం మేరకు వీకెండ్ వరకు రెస్ట్ తీసుకుని.. హైద్రాబాద్‌కు వచ్చి బిగ్ బాస్ షూటింగ్‌లో పాల్గొంటాడని అందరూ అంటున్నారు. ఈ దసరాకు మాత్రం రాలేకపోయాడని అందుకే సమంతతో కానిచ్చేస్తున్నారని టాక్.


Click it and Unblock the Notifications











