ఇదంతా మీ వల్లే సాధ్యం.. బిగ్ బాస్ ఫినాలే రేటింగ్స్‌పై నాగార్జున కామెంట్స్
బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. బిబీ తెలుగు గ్రాండ్ ఫినాలే అంటూ స్టార్ మా కూడా బాగానే ప్రమోట్ చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను సోషల్ మీడియాలో బిగ్ బాస్ టీం బాగానే వైరల్ అయ్యేలా చేసింది. అయితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో చిరంజీవి, నాగార్జున, సోహెల్, మెహబూబ్, సోహెల్ ఇలా బాగానే వైరల్ అయ్యారు. స్పెషల్ గెస్ట్‌లుగా వచ్చిన వారంత కూడా అలరించారు. అలా మొత్తంగా ఫినాలే టీఆర్పీలు రికార్డులతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది.
బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు 19.51 రేటింగ్ వచ్చింది. అదే సమయంలో మొదటి సీజన్‌లో 14.13, రెండో సీజన్‌లో 15.05, మూడో సీజన్‌లో 18.29 రేటింగ్స్ వచ్చాయి. అలా ప్రతీ సీజన్‌కు సరికొత్త రికార్డులుక్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇలా నాల్గో సీజన్ టీఆర్పీ రికార్డులపై నాగార్జున స్పందించాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నాగ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

నాల్గో సీజన్ ఫినాలే టీఆర్పీ లెక్కలపై నాగార్జున రియాక్ట్ అయ్యాడు. వావ్ అంటూ నాగార్జున ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, మాపై ప్రేమను కురిపించినందుకు థ్యాంక్స్.. మీరంతా లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.. ఆడియెన్స్, కంటెస్టెంట్లకు థ్యాంక్స్.. అంటూ చిరంజీవి, స్టార్ మా, ఎండమోల్ షైన్ ఇండియాను నాగార్జునను ట్యాగ్ చేశాడు.


Click it and Unblock the Notifications











