నా బెడ్‌, బాత్రూంను మరొకరితో పంచుకోను.. ఆమెతో తప్ప.. నాగార్జున

అక్కినేని నటవారసుడిగా నాగార్జున అక్కినేని ఇండస్ట్రీలోకి ప్రవేశించి సంచలన విజయాలు సొంతం చేసుకొన్నారు. సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు, ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమా గురించి, బిగ్‌బాస్ షో గురించి తెలుగు ఫిలింబీట్‌తో ముచ్చటించారు. నాగ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

హోస్ట్‌గా నాకు ప్రజల సంపూర్ణ మద్దతు

హోస్ట్‌గా నాకు ప్రజల సంపూర్ణ మద్దతు

టెలివిజన్‌ రంగంలో హోస్ట్‌గా నాకు రెండోసారి ప్రేక్షకుల నుంచి సమ్మతి లభించింది. మొదట మీలో ఎవరు కోటీశ్వరుడులో చాలా ఫార్మల్‌గా ఉండేది. ఎదుటి వాళ్లు చెప్పేది వినేవాళ్లం. ఒక్కొక్కరి సక్సెస్ స్టోరీలు నాకు వినే అవకాశం లభించింది. ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే 15 మంది సభ్యులను చూస్తే రోజు రోజుకు, వారానికి వారం మారిపోతున్నారు. ఈ వారం చూసిన వ్యక్తి గతవారం అలా కనిపించడం లేదు అని నాగార్జున అన్నారు.

నా బెడ్డు, బాత్రూం ఉపయోగించడం

నా బెడ్డు, బాత్రూం ఉపయోగించడం

బిగ్‌బాస్ హౌస్‌లో వారంలోనే మనుషులు మారిపోతున్నారు. చెప్పడం కంటే వారిని చూసి జడ్జ్ చేయడం కష్టంగా మారింది. అందుకే నాకు ఆ కాన్సెప్ట్ నాకు నచ్చలేదని చెప్పాను. ఒకవేళ నన్ను హౌస్‌లో ఉండమంటే ఒకటి, రెండో రోజులు కంటే ఎక్కువ ఉండనేమో. నా బెడ్డు, బాత్రూంను ఉపయోగించుకోవడం నాకు ఇష్టం ఉండదు. కేవలం నా భార్య తప్ప. అలాంటప్పుడు ఆ కాన్సెప్ట్ అసలే నచ్చదని చెప్పడం జరిగింది అంటూ నాగార్జున జోక్ చేశారు.

 బిగ్‌బాస్‌కు రికార్డు టీఆర్పీ రేటింగ్

బిగ్‌బాస్‌కు రికార్డు టీఆర్పీ రేటింగ్

బిగ్‌బాస్ షోకు పాపులారిటీ రోజు రోజుకు పెరిగిపోతున్నది. హోస్ట్‌గా నన్ను అంగీకరించారు. అన్ని వర్గాల్లోనూ బిగ్‌బాస్ షోపై ఆసక్తి పెరిగింది. అందుకు సాక్ష్యమే టెలివిజన్ రేటింగ్స్ (టీఆర్పీ). తెలుగు టెలివిజన్ రంగంలో ఏ షోకు రానటువంటి టీఆర్ఫీ రేటింగ్ రావడం హ్యాపీగా ఉంది. 15.07 రేటింగ్ వచ్చిందని విన్నాను. స్టేజ్ మీద వారితో జోకులు వేసుకుంటూ సరదాగా సాగిపోతున్నది. హోస్టింగ్ చేయడం చాలా ఫన్‌గా అనిపిస్తున్నది.

హోస్ట్‌గా నాగార్జునకు ప్రజల మద్దతు

హోస్ట్‌గా నాగార్జునకు ప్రజల మద్దతు

ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమై రెండు వారాలు ముగిసింది. మూడో వారంలోకి ప్రవేశించి వివాదాలతో ముందుకెళ్తున్నది. బిగ్‌బాస్ రియాలిటీ షోకు మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన హోస్టింగ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X