ఎన్టీఆర్ దూరం.. నానికి భయం.. నాగార్జున భలే రంజుగా!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 8వ సీజన్‌లోకి ప్రవేశించి బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. అయితే హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చ సుదీప్, మలయాళంలో మోహనల్ లాల్ మాదిరిగానే తెలుగులో హోస్ట్‌గా నాగార్జున అక్కినేని జోష్ చూపిస్తున్నారు. అయితే ఈ షోను ఎన్టీఆర్, నాని ఓ సీజన్ నడిపించారు. అయితే వారు ఎందుకు తప్పుకొన్నారనే విషయం అందరిలోను ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పటికే నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ బిగ్‌బాస్‌కు అత్యంత పాపులారిటీ లభించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో షోను ప్రారంభించారు. అయితే పలువురు హీరోలను సంప్రదించగా చివరికి జూనియర్ ఎన్టీఆర్‌ను ఒప్పించారు. దాంతో తొలి సీజన్ తారక్ హోస్ట్‌గా ప్రారంభమైంది.

Nagarjuna Akkineni command over Jr NTR Nani as Bigg Boss Telugu Host

అయితే తొలి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలితో, తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే రెండో సీజన్ కూడా అతడే ఉంటారని అనుకొన్నారు. కానీ ఆయన సడెన్‌గా ఆ షో నుంచి తప్పుకొన్నారు. అందుకు కారణం వ్యక్తిగత కారణాలు అనేవి వినిపించినా.. ఎండెమాల్ షైన్‌తో రెమ్యునరేషన్ విషయం కుదరకపోవడం వల్ల గుడ్ బై చెప్పారనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది.

ఎన్టీఆర్ తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నానీ తెరపైకి తెచ్చారు. రెండో సీజన్ ఆరంభంలో ఆయన తడబాటు పడినా.. షోను తనదైన శైలిలో ఊపుందుకొనేలా చేశారు. నాని చాలా సహజసిద్దంగా హోస్ట్ చేశారు. ఇక ఈయన సెట్ అనుకొన్న సమయంలో హోస్ట్‌గా చేయలేనని చేతులెత్తేశారు. దాంతో ఏంటి? ఎందుకు తప్పకొన్నాడనే విషయం చర్చనీయాంశమైంది.

నాని తప్పుకోవడం వెనుక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను భరించలేకపోయారు. ఆ సీజన్‌లో ఓ కంటెస్టెంట్ ఫ్యాన్స్ చాలా దారుణంగా నెగిటివ్ కామెంట్స్ చేయడంతో నాని తట్టుకోలేకపోయారు. ఈ వ్యవహారంతో తలనొప్పి ఎందుకని ఆయన తప్పుకొన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఆయన తర్వాత నాగార్జున అక్కినేని హోస్ట్‌గా సెట్ అయిపోయారు.

బిగ్‌డాస్ తెలుగు చరిత్రలో రెండు సీజన్ల మినహా ఎనిమిది సీజన్లలో ఆరు సీజన్లకు నాగార్జున హోస్ట్‌గా రాణిస్తున్నారు. బిగ్‌బాస్ హెస్ట్‌గా ఆయన చాలా పరిణితి, సమయస్పూర్తిని చూపిస్తూ రంజుగా కొనసాగిస్తున్నారు. నాగ్‌ తప్ప ఎవరూ అంత గొప్పగా చేయలేరు అనేంతగా మార్కులు వేసుకొన్నారు అని బుల్లితెర ప్రేక్షకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: nagarjuna akkineni jr ntr nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X