బిగ్‌బాస్ బ్యూటీ నుంచి నాగార్జున అప్పు.. మన్మథుడు ఏం అప్పు తీసుకొన్నాడో తెలుసా? (Bigg Boss Telugu 9 finale)
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ విజయవంతంగా ముగిసింది. 105 రోజులుగా సక్సెస్‌ఫుల్‌గా సాగిన ఈ రియాలిటీ షో డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్ ఫినాలతో ముగిసింది. ఈ సీజన్ ముగింపు కార్యక్రమం గ్రాండ్‌గా సాగింది. హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను, అలాగే టాప్ 5 కంటెస్టెంట్లను సాదారంగా వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం వారితోను, ఇంటిలోని సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్, తనూజ, డీమాన్ పవన్, కల్యాణ్ పడాలతో మాట్లాడారు. ఈ ఫినాలేలో చోటుచేసుకొన్న ఆసక్తికరమైన సన్నివేశాలు ఇంకా ఏమున్నాయంటే?
గత 15 వారాలుగా ఇంటిలో తమ ప్రతిభతో స్థిరంగా ఉన్న కల్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన గల్రానీ తెలుగు సినిమా పాటలపై డ్యాన్స్‌లు చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు. ఆ సందర్భంగా భావోద్వేగాలు కినిపించాయి. తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకొని హోస్ట్ నాగార్జున కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా ముందుకు నడిపించారు.

అంతకు ముందు ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లందరితోను వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి అనుభవాలను, అనుభూతులను పంచుకొన్నారు. ఈ సందర్భంగా రమ్య పికిల్‌తో మాట్లాడుతూ.. ఎలా ఉన్నావు అంటే.. చాలా బాగున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా.. బాగున్నా.. బాగా లేకపోయినా నేను హ్యాపీగా ఉంటాను అని రమ్ పికిల్ అన్నారు.
ఆ తర్వాత నాగార్జున అక్కినేనితో రమ్య పికిల్ మాట్లాడుతూ.. మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారు అని కాంప్లిమెంట్ ఇస్తే.. అవునా.. అంటూ సమాధానం ఇస్తూ.. ఆ అందాన్ని నీ నుంచే అప్పుగా తీసుకొన్నాను అంటూ మన్మథుడు చమత్కరించాడు. అలాగే అందరి కంటెస్టెంట్లతో నాగ్ తనదైన శైలిలో మాట్లాడుతూ షోను ఆసక్తికరంగా మార్చారు.
గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశా సైనీ, శ్రీజ దమ్ము, భరణి శంకర్, రమ్య పికిల్, దివ్వెల మాధురి, రాము రాథోడ్, శ్రీనివాస సాయి, గౌరవ్, నిఖిల్, రీతూ చౌదరీ, సుమన్ శెట్టి, భరణి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రష్టి వర్మ, దివ్య నిఖిత కనిపించకపోవడం ఆడియెన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగించింది.


Click it and Unblock the Notifications











