సౌందర్యను అక్కడే కలిశా.. అదే ఫస్ట్ టైమ్.. హోస్ట్ నాగార్జున భావోద్వేగం
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబ:ధించి ఎనిమిదో వారాంతం ఎలిమినేషన్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇంటిలో ఎప్పటిలానే గేమ్‌లో భాగంగా రికార్డింగ్ డ్యాన్స్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి సభ్యులకు ఓ మ్యూజిక్ వినిపించి పాటను కనిపెట్టి డ్యాన్స్ చేయాలి.. ఈ సందర్భంగా ఓ పాట ప్లే చేసిన నేపథ్యంలో ఓ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకొంటూ గతంలోకి వెళ్లిపోయారు.. ఆ సినిమా పేరు.. ఆ విషయాలు ఏమిటంటే..

హలో బ్రదర్ చిత్రం గురించి
అక్కినేని నాగార్జునకు మంచి విజయాన్ని అందించిన చిత్రం హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో అద్భుతమైన విజయాన్ని అందించింది. నాగార్జున కెరీర్‌లో మంచి చిత్రంగా మారింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు.

రాజ్ కోటి మ్యూజిక్ ఇవ్వగా
1994లో వచ్చిన హలో బ్రదర్ సినిమా కోసం రాజ్, కోటి ద్వయం సంగీతాన్ని అందించారు. మెలోడి, మాస్, క్లాస్ కలబోసి పాటలను అందించారు ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ప్రియరాగాలే గుండెలో.. అనే పాట అన్ని వర్గాలకు చేరువైంది. ప్రతీ ఒక్కరి నోట ఈ పాట పలికింది.

హారిక, అమ్మా రాజశేఖర్ డ్యాన్స్
హలో బ్రదర్ సినిమాలోని పాటను సండే రోజున ఫన్‌డే కార్యక్రమంలో బిగ్‌బాస్ ప్లే చేయగా.. అభిజిత్ టీమ్ గుర్తు పట్టి డ్యాన్స్ చేశారు. ఈ పాటపై హారిక, అమ్మా రాజశేఖర్ డ్యాన్స్ చేసి ఇంటి సభ్యులనే కాకుండా, అభిమానులను, నాగార్జునను ఆకట్టుకొన్నారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ... ఆ సినిమా గురించి ఇంటి సభ్యులతో మాట్లాడారు.

సౌందర్యతో అలా పరిచయం
హలో బ్రదర్ సినిమాను ప్రియ రాగాలే గుండెలోన పాటతో ప్రారంభించాం. ఆ సినిమా సెట్లో సౌందర్యను కలిశాను. ఆమెను అలా కలవడం అదే మొదటిసారి అంటూ నాగార్జున తెలిపారు. ఈ పాట వినగానే ఒక్కసారిగా అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి అంటూ నాగార్జున నవ్వులు చిందించారు.

గ్రూప్ డ్యాన్సర్‌గా పనిచేశా అంటూ..
నాగార్జున అలా మాట్లాడుతుండగానే అమ్మా రాజశేఖర్ ఏదో చెప్పబోయాడు.. మాస్టర్ ఏమిటో చెప్పు అంటే.. ఆ సినిమాకు నేను గ్రూప్ డ్యాన్సర్ అన్నారు. ఓహో నీవు అప్పుడు అక్కడ ఉన్నారా? అంటే ఆ పాట చివరి రోజున నేను గ్రూప్ డ్యాన్సర్‌గా పనిచేశాను అంటూ అమ్మా రాజశేఖర్ చెప్పి స్టెప్పులతో అలరించారు. మీకు ఆ పాట స్టెప్పులు ఇంకా గుర్తున్నాయి అంటూ నాగార్జున ప్రశంసించారు.


Click it and Unblock the Notifications











