మహేష్ భాబును షూటింగులో వదిలేసి ఆ పని చేసిన అనిల్ రావిపూడి.. సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే బ్రహ్మండంగా కలర్‌ఫుల్‌గా మొదలైంది. వేదికపై నాగార్జున చలాకీగా, హుషారుగా తన మాటలతో ఆకొట్టుకొన్నారు. ఇంటి సభ్యులతో మాట్లాడుతూనే వేదికపైకి F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ మెహ్రీన్‌ను స్వాగతించారు. ఇంటిలోకి పంపిస్తూ వారిద్దరికి ఏ సలహాలు ఇచ్చారంటే..

బిగ్‌బాస్ గురించి అనిల్ రావిపూడికి
అనిల్ రావిపూడితో నాగార్జున మాట్లాడుతూ.. మీకు బిగ్‌బాస్ గురించి పూర్తిగా అన్ని సీజన్ల గురించి తెలుసని తెలిసింది. ఏ సీజన్‌లోనైనా ఏ ఎపిసోడ్ గురించి అడిగితే.. మీరు అంతా చెబుతారట కదా అంటూ అడిగితే.. అదో పెద్ద కథ అంటూ సమాధానం ఇచ్చారు.

మహేష్ బాబును వదిలేసి...
అయితే బిగ్‌బాస్‌ను అనిల్ రావిపూడి ఎంతగా అభిమానిస్తారంటే.. మహేష్ బాబును షూటింగులో వదిలేసి 9.30కు బయటకు వెళ్లి 10.30 గంటలకు వచ్చారు. ఆ మధ్యలో బిగ్‌బాస్ చూసి వచ్చాడంట.. అనిల్ రావిపూడికి బిగ్‌బాస్ అంటే అంత ఇష్టం అని నాగార్జున తెలిపారు.

నాగార్జున టాస్క్‌ను తిరస్కరించిన అనిల్ రావిపూడి
ఇక ఇంటిలోకి అనిల్ రావిపూడిని పంపిస్తూ.. కొన్ని ప్రశ్నలతో కూడిన కవర్‌ను ఇచ్చారు. అందులోని ప్రశ్నలను అడగాలి. ఆ తర్వాత ఓ ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేయాలి. అతడిని వేదిక మీదకు తీసుకురావాలి అంటూ నాగార్జున సూచించాడు. అయితే ఫన్ క్రియేట్ చేస్తాను కానీ.. ప్రస్టేషన్ నాతో కాదు. కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు ఇక్కడే ఉన్నాను. వారిని బాధపెట్టను అంటూ నాగార్జున టాస్క్‌ను అనిల్ తిరస్కరించాడు.

గ్రాండ్‌గా ఇంట్లోకి ఎంట్రీ
అయితే టాప్ 5 కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే బాధ్యతను హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాకు అప్పగించారు. గోల్డ్ కవర్ ఇచ్చి దానిని తాను చెప్పే వరకు ఓపెన్ చేయకూడదు అని నాగార్జున చెప్పారు. దాంతో వారిద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు.
Recommended Video

టాప్ 5 కంటెస్టెంట్లతో చిట్ ఛాట్
అనిల్ రావిపూడి, మెహ్రీన్ పిర్జాదాను వైభవంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. బ్యాండ్ మేళంతో ఇంట్లోకి వెళ్లిన వారిద్దరిని టాప్ 5 కంటెస్టెంట్లు స్వాగతించారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి కంటెస్టెంట్లతో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.


Click it and Unblock the Notifications











