Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Bangarraju OTT Release.. నాగార్జున ‘బంగార్రాజు’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రం సంక్రాంతి రేసులో విడులైన సినిమాల్లో భారీ విజయాన్ని అందుకొన్నది. గతంలో నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు చిత్రం వినోదం, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆలరించింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమైంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే..
జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా
ఇటీవల కాలంలో అక్కినేని నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌కు, జీ స్టూడియోస్‌తో మంచి అనుబంధం కొనసాగుతున్నది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూజర్ 2 వెబ్ సిరీస్‌ను జీ 5 ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం లూజర్ 2 చిత్రం మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. ఇదిలా ఉండగా సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది చిత్రాన్ని కూడా జీ5లోనే రిలీజ్ చేయడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలో జీ5 ఓటీటీ బంగార్రాజు సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది.
సంక్రాంతి పండుగ కానుకగా
దర్శకుడు కల్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నాగ చైతన్య, కింగ్ నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చింది. కరోనావైరస్ పరిస్థితులు, ఏపీలో టికెట్ల రేట్ల వివాదం మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. ఈ సంక్రాంతి బరిలో పూర్తి వినోదాన్ని పండించిన చిత్రంగా బంగార్రాజు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను పంచింది.
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు
బంగార్రాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా తడాఖాను చూపించింది. బంగార్రాజు చిత్రం 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో సంక్రాంతి బరిలో దిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 35.42 కోట్లు షేర్, 58 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 38.77 కోట్ల షేర్, 65.25 గ్రాస్ వసూళ్లను సాధించింది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించలేకపోయారు.
Recommended Video
ఫిబ్రవరిలో జీ 5 ఓటీటీలో..
బంగార్రాజు సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అభిమానులకు మరింత చేరువ చేయనున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18వ తేదీన జీ5 ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. థియేటర్లో కూడగట్టుకొన్నట్టుగానే ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్సాన్స్‌ను సొంతం చేసుకొంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.