For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు కోసం నాగార్జున మాట మార్చారా? సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్!

|

'ఈ సారి నేనే బిగ్ బాస్ షో కోసం రంగంలోకి దిగుతున్నాను' అంటూ నాగార్జున ప్రోమో విడుదల చేయడం ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ చేసేది ఈ టాలీవుడ్ మన్మధుడే అనే విషయం అపీషియల్‌గా ఖరారు చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో బిగ్ బాస్ షోలోపై మరింత ఆసక్తి పెంచింది.

ఇందులో బిగ్ బాస్ షో కోసం నాగార్జున వంటసామాగ్రి షాపింగ్ చేస్తూ కనిపించారు. నీ దగ్గర ఉన్న గుడ్లన్నీ ఇవ్వు... ఆకలేస్తే తింటారు, కోపం వస్తే వాటితోనే కట్టుకుంటారు. వంకాయల్లా గలు పోయేవారు ఉంటారే అక్కడికి ఈ వంకాయలు తీసుకెళుతున్నాను. మొత్తం 14 మంది, 100 రోజులు అంటూ.... ప్రోమో చిత్రీకరించారు. అయితే ఈ ప్రోమో విడుదలైనప్పటి నుంచి నాగార్జున మీద సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.

ట్రోలింగుకు కారణం నాగార్జున గతంలో చేసిన కామెంట్సే

బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ... ‘బిగ్ బాస్ షో కాన్సెప్టు తనకు ఇష్టం ఉండదని, పక్కింటివాడి జీవితంలోకి తొంగిచూడటం ఏం గేమ్' అంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు నాగార్జునకు పద్ద తలగొప్పిగా మారాయి.

నాగార్జున మాట మార్చారు

అప్పుడు బిగ్ బాస్ షో ఇష్టం ఉండదు, పక్కోడి జీవితంలోకి తొంగిచూడటం సరైంది కాదంటూ కహానీలు చెప్పిన నాగార్జున... ఇప్పుడు ఇదే షోను హోస్ట్ చేయడానికి రంగంలోకి దిగడంతో ఆయన మాట మార్చారని, ఇలా చేయడం ద్వారా నాగార్జున తన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

డబ్బు తప్ప, విలువలు లేవంటూ దారుణంగా

మరికొందరైతే నాగార్జున మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు డబ్బు తప్ప విలువలు లేవు. ఇలాంటి వారు పైకి చాలా మాట్లాడతారు కానీ, టైమ్ వస్తే డబ్బు కోసం ఏమైనా చేస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘బిగ్ బాస్ 3' షో ప్రారంభానికి ముందే ఇలాంటి పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

నాగార్జున అలాంటివి ఫేస్ చేయడానికి సిద్దంగా ఉండాలి

‘బిగ్ బాస్' షో అంటేనే వివాదాలకు కేంద్ర బింధువు. ఇందులో పాల్గొనే వారు మాత్రమే కాదు... హోస్ట్ చేసే వారికి సైతం కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. గత సీజన్లో నాని ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌తో కంపేర్ చేస్తూ కొందరు విమర్శలు చేశారు. కౌశల్ ఫ్యాన్స్ సైతం నానితో ఆడుకున్నారు. నాగార్జునకు కూడా ఇలాంటి కష్టాలు తప్పేలా లేవు.

బిగ్ బాస్ తెలుగు 3

బిగ్ బాస్ తెలుగు 3లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయం ఇంకా అఫీషియల్‌గా వెల్లడికాలేదు. షో ప్రారంభం రోజే ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం జులై 21న ఆదివారం ఈ షోను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

English summary
Actor Nagarjuna Akkineni has been officially announced as the host of the upcoming Bigg Boss Telugu season 3. Nagarjuna Akkineni’s gets trolled for signing the Bigg Boss Telugu 3. In his old interview Nagarjuna had stated that he doesn’t like the concept of Bigg Boss as it is ‘voyeuristic’.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more