శోభాశెట్టి గొంతుపై కాలేసి తొక్కుతావా? పల్లవి ప్రశాంత్, శివాజీ తాట తీసిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 7 వారాంతపు ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున అక్కినేని చెలరేగిపోవడంతో కంటెస్టెంట్లకు చెమటలు పట్టాయి. గతవారం రోజులుగా ఇంట్లో జరిగిన గొడవలు, వాగ్వాదాలను బేస్ చేసుకొని వీడియోల చూపిస్తూ నాగ్ వారి తాట తీసినంత పని చేశారు. ముఖ్యంగా శుక్రవారం ఎపిసోడ్‌లో శోభాశెట్టి, శివాజీ మధ్య జరిగిన గొడవ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివాదాన్ని బేస్ చేసుకొని అందరికి క్లాస్ పీకుతూ..
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఓ ఫన్ టాస్క్ సమయంలో శోభా శెట్టి సంచాలకులుగా వ్యవహరించారు. బాల్ త్రో గేమ్‌లో ఆమె రూల్స్ మార్చడంపై శివాజీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాంతో వారి మధ్య మాట మాట పెరిగింది. శోభాశెట్టి లైన్ క్రాస్ చేసి శివాజీపై గట్టిగా కేకలు వేసింది. దాంతో అవమానంగా భావించిన శివాజీ తీవ్రమైన పదజాలంతో దూషించినంత పనిచేశాడు.

శోభాశెట్టి ప్రవర్తనతో విసిగిపోయిన శివాజీ.. మా ఇంట్లో ఇలా హద్దు మీరి మాట్లాడితే.. చెంపలు పగలగొట్టే వాడిని. నాలుగు పీకేసేవాడిని. ఇలాంటి మాటలు మాట్లాడితే గొంతుపై కాలుపెట్టి తొక్కేసే వాడిని అంటూ శివాజీ ఆగ్రహంతో ఊగిపోయాడు. అలా మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇక శివాజీ చేసిన కామెంట్లను బిగ్‌బాస్ తీవ్రంగా పరిగణించాడు. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఈ అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా బిహేవ్ చేస్తే మీ ఇంట్లో అమ్మాయిలను అలానే పీకుతావా? అంటే.. తప్పకుండా పీకుతాను అంటూ సమాధానం ఇచ్చాడు. దాంతో గొంతుపై కాల్ పెట్టి తొక్కుతావా? అంటే అలా అన్నంత మాత్రాన చేస్తామా? అని శివాజీ తన వ్యాఖ్యలను సమర్ధించుకొన్నాడు.

శోభాశెట్టిన టార్గెట్ చేయడం కాదు.. ఆమె వ్యవహరించిన తీరుపై బాధతో అలా అన్నాను అని శివాజీ కామెంట్ చేశాడు. అయితే షోకు వచ్చిన ఆడియెన్స్‌తో అభిప్రాయాలు తీసుకొన్నారు. అయితే ఆడపిల్లను అలా అనడం తప్పే.. అని ఓ ప్రేక్షకురాలు అంటే.. అయితే మగాళ్లను ఏదైనా అనొచ్చా అంటూ శివాజీ ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో నీవు టాపిక్ డైవర్ట్ చేయకు అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు.
అయితే నా ఇంట్లో వాళ్లు అలా చేస్తే కాలితో తొక్కేస్తానని చెప్పావని నాగ్ అంటే.. ఆ మాటలు అలా ఫ్లో వచ్చాయి. అలా మాట్లాడటం నాది పొరపాటే అంటూ శివాజీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే నీది తప్పు కాదు.. బిగ్ బ్లండర్. హియాలయన్ బ్లండర్ అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. .

ఇక పల్లవి ప్రశాంత్‌కు నాగార్జున క్లాస్ పీకాడు. శివాజీకి సహాయం చేయడంపై నీవు కంటెస్టెంట్‌వా? లేక శివాజీకి పనివాడివా? అంటూ మండిపడ్డాడు. నీవు ఎప్పుడుపడితే అప్పుడు వీడియోలు చూపించమంటే.. బిగ్‌బాస్‌కు పనిలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications











