Bigg Boss Telugu 7 ప్రియాంక ఊపులకు పడిపోయిన హీరో రామ్.. నాగార్జున కూడా ఓ రేంజ్‌లో...
బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈసారి ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ షోను కొనసాగిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కొత్త కొత్త టాస్కులు, గేమ్స్ పెడుతూ... ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక వీకెండ్ వచ్చిందంటే... ప్రేక్షకులు సండే ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తారు. ఈ వారం సండే ఫన్ డేలో నాగార్జునతో పాటు.. స్కంద ప్రమోషన్స్ లో భాగంగా రామ్ కూడా సందడి చేస్తాడు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ప్రియాంక ఊపులకు రామ్ పడిపోయారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో హీరో రామ్... తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ కు వచ్చారు.

రామ్ స్కంద సినిమా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌజ్ కు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల అయిన ప్రోమో గమనిస్తే... మీరు రామ్ ను మించిన డ్యాన్సర్ అని ప్రూవ్ చేయాలి అని తేజకు చెప్తాడు నాగార్జున. ఓకే అని చెప్తాడు తేజ. ఆ తర్వాత ఓ పోటీ నిర్వహించినట్లు ఉంది. అందులో అమర్ దీప్, ప్రశాంత్ పాల్గొన్నారు. ఇక రామ్ కు ప్రశాంత్ గురించి చెప్తాడు నాగార్జున. ఆయన రైతు బిడ్డ అంటూ చెప్పుకొస్తాడు.
ఇక అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కు అమర్ దీప్, ప్రశాంత్ డ్యాన్స్ వేస్తారు. అమర్ దీప్ డ్యాన్స్ కు నాగార్జున, రామ్ ఫిదా అవుతారు. ఇక అమర్ కు ఈ పాట బాగా ఇష్టమైంది అనుకుంటా అని చెప్తాడు రామ్. లేదు.. ఆయన హెయిర్ స్టైల్ చూస్తే తెలియట్లే.. రవితేజ ఫ్యాన్ అని చెప్తాడు నాగార్జున. అలా కాసేపు హౌజ్ లో నవ్వులు పూస్తాయి.

ఇక ప్రియాంక జైన్, శోభా శెట్టి డ్యాన్స్ చేస్తారు. మహేశ్ బాబు సాంగ్ కు ఇద్దరు పోటి పడి చేస్తారు. ఇక డ్యాన్సుల్లో రామ్.. ప్రియాంక డ్యాన్స్ కు ఫిదా అయిపోతారు. ఇది బెస్ట్ పోటీ అంటూ కితాబు ఇస్తాడు. ఇక నాగార్జున సైతం ఆమె డ్యాన్స్ కు ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్స్ లో ఉన్న వాళ్లు నిల్చోండని నాగార్జున అంటాడు. నామినేట్ అయిన వారు నిల్చుంటారు.
ఇక నామినేషన్స్ లో ఉన్న వారి ఫోటోలు ఉంటాయి. వారి ఫోటోలను ఓ సుత్తి తీసుకుని నాగార్జున పగులగొడుతాడు. ఏం జరిగిందో తెలియదు కానీ... నాగార్జున చేసిన పనికి హౌజ్ మేట్స్ అంతా ఏడుస్తారు. చాలా ఎమోషల్ అయిపోతారు. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ ఓ సాడ్ మ్యూజిక్ వేసి.. మనల్ని ఎమోషనల్ చేసేస్తాడు. ఇక ఇంతటితో ప్రోమో ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











