Bigg Boss Telugu 7: టేస్టీ తేజపై మోనిత కుట్ర.. బాడీపై అలా చేయాలని.. ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున
ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ.. రికార్డులకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న ఏకైక షోనే బిగ్ బాస్. అంతలా ఇది ఏడేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా సత్తా చాటుతోంది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని ప్రారంభించారు. ఆరంభం నుంచే ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శోభా శెట్టి కుట్రను నాగార్జున బయటపెట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే....
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది, ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో అతి తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. వారిలో ప్రముఖ కమెడియన్ టేస్టీ తేజ ఒకడు. తనదైన కామెడీతో సందడి చేస్తోన్న అతడు.. అదిరిపోయే ఆటతీరును కూడా కనబరుస్తున్నాడు. దీంతో క్రమంగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు.

హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచే టేస్టీ తేజ అందరితోనూ కలివిడిగానే ఉంటున్నాడు. కానీ, ఎక్కువగా శోభా శెట్టితో ఎక్కువ క్లోజ్ అయ్యాడు. తరచూ ఆమెతోనే ఉంటూ, ఆమె చెప్పినట్లే చేస్తూ సరదాగా సాగిపోతోన్నాడు. ముఖ్యంగా శోభను సైట్ కొడుతున్నట్లుగా టీజ్ చేస్తూ మజాను కూడా పంచుతున్నాడు. ఫలితంగా వీళ్లిద్దరి బంధం మరింత పెరుగుతూనే ఉంటోంది.
శోభా శెట్టి కోసం ఏం చేయడానికైనా వెనుకాడనని టేస్టీ తేజ పలుమార్లు చెప్పాడు. ఈ క్రమంలోనే గత వారంలో ఆమె తన గుండెల్లో ఉందని, అవసరం అయితే పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంటానని చెప్పాడు. దీంతో బిగ్ బాస్ టేస్టీ తేజను అప్పటి నుంచి ఆమె పేరును టాటూగా వేయించుకోవాలని ఏడిపిస్తున్నాడు. అలాగే కొన్ని డిజైన్లను కూడా పంపించి షాకిచ్చాడు.
బిగ్ బాస్ టాటూ వేయించుకోమని ఫోర్స్ చేయడంతో టేస్టీ తేజ భయపడిపోయాడు. అప్పుడు శోభా శెట్టి కూడా అతడిని పచ్చబొట్టు వేయించుకోమని కంగారు పెట్టింది. దీంతో తేజ 'నువ్వు నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటానంటే టాటూ వేయించుకుంటాను' అన్నాడు. అప్పుడు శోభా కామ్ అయింది. ఇదే అంశాన్ని శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కూడా ప్రస్తావించాడు.
నాగార్జున అడగ్గానే టేస్టీ తేజ 'సార్.. అర్జున్ శోభా అనే పేరు రెండు తొడలపై వేయించుకో అన్నాడు. కానీ ఇప్పటికీ నా మాట మీద కట్టుబడి ఉన్నాను. తను నాతో పెళ్లికి ఓకే అంటే వేసుకుంటా' అన్నాడు. దీనికి హోస్ట్ 'ఏమ్మా శోభా ఒప్పేసుకోవచ్చుగా. పని అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించు' అన్నాడు. దీంతో శోభా 'అలా అయితే నాక్కూడా ఓకే సార్' అనేసింది.

మొదట్లో టేస్టీ తేజను టాటూ వేసుకోమని ఏడిపించిన నాగార్జున.. శోభా శెట్టిని కూడా బాగానే రెచ్చగొట్టాడు. ఎపిసోడ్ చివర్లో మాత్రం 'తేజ నువ్వే ఆలోచించుకో. ఆమె ఎప్పుడు శోభాలా ఉంటుందో.. ఎప్పుడు మోనితలా మారుతుందో ఎవరికీ తెలీదు. తర్వాత నీ ఇష్టం' అంటూ శోభాకు ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తానికి సరదాగా సాగిన వీళ్ల ఎపిసోడ్ ప్రేక్షకులకు మజాను పంచింది


Click it and Unblock the Notifications











