Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌లో హీరో రామ్ పెళ్లి ప్రస్తావన... నాగార్జున, శివాజీ సెటైర్స్

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి మూడు వారాలు అయ్యింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. సండే ఫన్ డే అంటూ నాగార్జున హౌస్ మేట్స్ తో సరదా సరదా ఆటలు ఆడించి.. ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సండెే ఫన్ డే ఎపిసోడ్ ప్రోమోలు విడుదల అయి ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోలో స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రామ్ వచ్చి సందడి చేశారు. హౌస్ మేట్స్ తో కలిసి సరదా సరదాగా గడిపారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి ప్రోమో విషయానికి వస్తే... నాగార్జున కంటెస్టెంట్స్ అందర్నీ చూస్తూ ఏ గ్లామరస్ బాయ్ అని తేజను అంటాడు. ఆ తర్వాత అరె యావర్ నువ్వు కూడా అదిరిపోయావు అని చెప్తాడు. ఆ తర్వాత చిట్టి ప్రశ్న అనే ఆటను ఆడబోతున్నామని చెబుతూ .... అన్న మల్లొచ్చినా అంటూ ప్రశాంత్ ను ఇమిటేట్ చేస్తాడు నాగార్జున.

Nagarjuna and Sivaji satires on Hero Ram Marriage in Bigg Boss Telugu 7 House

శివాజీని గేమ్ లోకి పిలిచి... హౌజ్ లో కలుపు మొక్క ఎవరూ అనగానే... చాలా మంది ఉన్నారని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత శివాజీ, తేజ కలుపు మొక్కా అని చెప్తాడు. తేజ కి డిస్కషన్ ఎక్కువ అని శివాజీ చెప్తే.. నిజమేనా అని నాగార్జున తేజను అడుగుతాడు. దానికి నాకు తెలియదు సార్, ఇప్పుడే తెలిసింది అని తేజ చెప్తాడు. ఇక ఆ తర్వాత ఈ హౌస్ లో తేనె పూసిన కత్తి ఎవరు? అని నాగ్ అడగ్గా.." అది నేనే అనుకుంటున్నాను సార్ అని దామిని" చెబుతుంది. దానికి నాగర్జున, "ఇది సేఫ్ గేమ్ కదమ్మా" అని అంటాడు.

Nagarjuna and Sivaji satires on Hero Ram Marriage in Bigg Boss Telugu 7 House

ఆ తర్వాత రతిక వచ్చి గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఇక అప్పుడు రెండు కలర్స్ మధ్యన ముళ్ళు ఉంటుంది. రతిక నీకైతే ఏదో రెండు కలర్స్ మధ్య కన్ఫ్యూజన్ లాగా ఉందని నాగార్జున చెప్పగానే అందరూ నవ్వేస్తారు. ఇంట్లో ఎవరికీ పని తక్కువ, తిండి ఎక్కువ? అని టేస్టీ తేజని అడిగితే తేజ, రతిగా అని బదిలిస్తాడు. మొత్తానికి ఈ వారం సరదా సరదాగా సాగిందని మొదటి ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది.

Nagarjuna and Sivaji satires on Hero Ram Marriage in Bigg Boss Telugu 7 House

ఇక రెండో ప్రోమో గమనిస్తే... ఈ షోలో స్కంధ మూవీ ప్రమోషన్స్ చేయడానికి హీరో రామ్ అడుగుపెడతాడు. స్టేజ్ పైకి వచ్చి నాగార్జునని హగ్ చేసుకుని హౌస్ మేట్స్ కి హాయ్ చెబుతాడు. శివాజీ గారు మీరు బాగా షార్ప్ గా ఉన్నారు అని రామ్ చెప్తాడు. ఇక నాగార్జున మధ్యలో కలగచేసుకుని... ఇప్పటిదాకా నాతో కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడావు, అదే ఆడపిల్లలు కనపడగానే కళ్ళజోడు తీసేశావ్ అంటూ ఫన్నీగా ఆట పట్టిస్తాడు.

ఇక శివాజీ రామ్ గురించి మాట్లాడుతూ... పెళ్లి చేసేసుకో బ్రో అంటాడు. ఎందుకు అని రామ్ అడిగితే.. ఇప్పటికే లేట్ అయిపోయింది.. ఈ సినిమా అయిపోగానే చేసుకో అని సలహా ఇస్తాడు. ఇక నాగార్జున కలగజేసుకుని ఊబిలోకి దిగిన వారికే తెలుస్తోంది అంటూ ఫన్నీగా చెప్తాడు. ఇక హౌజ్ లోని వాళ్లంతా నవ్వుతారు. ఇక ఆదివారం స్కంద ప్రమోషన్స్ లో రామ్ పాల్గొనగా హౌజ్ అంతా సందడిగా మారిపోతుందని అర్ధం అవుతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో దామిని ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X