Bigg Boss Telugu 7: రూ.50 లక్షలు కాకుండా విన్నర్‌కు ఇచ్చేవి ఇవే... నాగార్జున భలే టెంప్ట్ చేస్తున్నాడే!

బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. మరో రెండు వారాల్లో ఈ గేమ్ షో ముగియనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉండగా ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ కానున్నారు. ఇక ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సీజన్ విన్నర్ రేసులో శివాజీ, ప్రశాంత్, అమర్ ఉండనున్నారని తెలుస్తోంది. అయితే నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ ప్రైజ్ మనీని ప్రకటించారు. బిగ్ బాస్ తెలుగు 7 విజేతకు 50 లక్షల రూపాయలతో పాటు మరిన్నీ అందజేయనున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఆ రోజున 14 మంది కంటెస్టెంట్స్ ఇంటిలోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ షో అంటే దాదాపు 20 మందిని పంపిస్తారు. ఎందుకంటే 100 రోజులు హౌస్ లో ఉండాలి. వారానికి ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఈ సీజన్ 14 మంది పోయే సరికి అందరూ ఆశ్యర్య పడ్డారు.

Nagarjuna Announced Bigg Boss Telugu 7 Prize Money Rs50Lakhs and brezza car, rs15 joyalukkas Full Details Here

ఇక ఐదో వారాలం అసలైనా ఉల్టా పుల్టా అంటూ మరో ఐదుగురిని హౌస్ లోకి పంపించారు. ఇక ఆరో వారంలో మరో రీఎంట్రీ జరిగింది. ఇక హౌస్ లో మొత్తానికి 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. ఒకరు రీఎంట్రీ.. మొత్తం 20మంది అనుకోవాలి. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఈ ఆదివారం ఎపిసోడ్ లో గౌతమ్ ఎలిమినేట్ కానున్నారు.

ఇక హౌస్ లో ఉండేది అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, అర్జున్ అంబటి, యావర్, ప్రియాంక, శోభా శెట్టి, యావర్ ఉండునున్నారు. ఇక అర్జున్ అంబటి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత 7 సీజన్స్ గా బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది ఎవరికి వస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలోనే నాగార్జున ఈ ఆదివారం ఎపిసోడ్ లో ప్రైజ్ మనీని ప్రకటించాడు అని తెలుస్తోంది. ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. ప్రైజ్ మనీ కూడా బాగానే ఉంది. గత సీజన్స్ లో మామూలుగా 50లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉండేది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రైజ్ మనీని రూ.50లక్షలతో పాటు.. బ్రేజా కార్ ప్లస్ జాయాలుక్కాస్ 15లక్షలు అని నాగార్జున అనౌన్స్ చేశాడు.

Nagarjuna Announced Bigg Boss Telugu 7 Prize Money Rs50Lakhs and brezza car, rs15 joyalukkas Full Details Here

ఈ లెక్కన విన్నర్ కు 75లక్షల రూపాయలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పటికే అర్జున్ అంబటి ఫస్ట్ ఫైనాలిస్ట్ కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యాడు. ఇక విన్నర్ రేసులో ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X