Bigg Boss Telugu 7: 12వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు వెళ్లిపోయే ఛాన్స్.. అంతలోనే మరో ట్విస్ట్
ఆరంభంలో వివాదాలు చుట్టు ముట్టినా ఏమాత్రం ఆదరణ కోల్పోకుండా.. ఏడేళ్లుగా ఇండియాలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచేసే కంటెంట్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తూ దీన్ని నిర్వహకులు మరింతగా రసవత్తరంగా మారుస్తున్నారు. దీంతో ఈ షో ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడో దాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఇది కూడా ఆరంభం నుంచే జనరంజకంగా సాగుతూ మజాను పంచుతోంది. ఈ నేపథ్యంలో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ షాకివ్వబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే....
మరింత ఆసక్తికరంగా ఏడో:బిగ్ బాస్ ఏడో సీజన్ ఎన్నో అంచనాలతో ప్రారంభమై.. భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు పెట్టడంతో పాటు ఉల్టా పుల్టా కంటెంట్‌ను ఎక్కువగా చూపించడంతో ఇది అందరి దృష్టిలో పడుతోంది. అంతేకాదు, రోజు రోజుకూ మరింత రంజుగా మారుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతోంది.

19 మంది.. 10 బయటకు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారం నయనీ, 7వ వారం పూజా, 8వ వారం సందీప్, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలేలు బయటకు వెళ్లిపోయారు.
11వ వారంలో అంతా సేఫ్:బిగ్ బాస్ ఏడో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఫినాలే జరగబోతుంది. ఈ నేపథ్యంలో 11వ వారంలో మొత్తంగా శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేషన్‌లోకి వచ్చేశారు. కానీ, ఈ వారంలో ఎలిమినేషన్ జరగలేదు. ఈ విషయాన్ని ఆదివారం ఎపిసోడ్‌లో చూపించారు.

అందుకే తీసేశామంటూ:ఏడో సీజన్‌లో 11వ వారం ఎలిమినేషన్ తీసేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున స్వయంగా స్పందించాడు. ప్రిన్స్ యావర్ తన ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇచ్చేయడం వల్లే ఈ వారం ఎలిమినేషన్ తీసేయాల్సి వచ్చిందని తెలిపాడు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న వాళ్లు ఖుషీ అయ్యారు.
12వ వారం డబుల్ అని:11వ వారంలో ఎలిమినేషన్ తీసేయడంతో నామినేషన్స్‌లో ఉన్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడే నాగార్జున స్పందిస్తూ.. 'హలో గాయ్స్ దీనికి మీరంతా సంతోషపడకండి. ఎందుకంటే వచ్చే వారం (12వ వారం)లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది' అంటూ ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు.

ఈ వారంలో ఆ ఇద్దరు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 12వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ఈ వారంలో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేషన్‌లోకి వచ్చేసినట్లు తెలిసింది. ఈసారి ఎక్కువగా టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో వీక్‌గా ఉన్న ఇద్దరే వెళ్లిపోయే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.
చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చి:12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ షాకిచ్చిన హోస్ట్ నాగార్జున.. చివర్లో మాత్రం ట్విస్ట్ ఇస్తూ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. 11వ వారంలో నిర్వహించిన 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్క్ నిరుపయోగం అవడంతో.. 12వ వారంలో దీన్ని మళ్లీ పెట్టబోతున్నట్లు చెప్పాడు. అంటే.. ఇది గెలిచిన వాళ్లు కూడా ఎలిమినేషన్‌ను డిసైడ్ చేసే అవకాశం ఉండబోతుంది.


Click it and Unblock the Notifications











