twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టిన నాగార్జున.. చరిత్రలోనే అత్యధికంగా..

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలో 'బిగ్ బాస్' రియాలిటీ షోది ప్రత్యేక స్థానం. గతంలో ఎన్నో షోలు వచ్చినా దీనంత ఎఫెక్ట్ మరేది చూపించలేదు. కారణం.. ఈ షోలో జరిగే గొడవలు.. దాని చుట్టూ అల్లుకుని ఉన్న వివాదాలు. అవును.. 'బిగ్ బాస్' హౌస్‌లో తిట్లుకోవడాలు.. నెట్టుకోవడాలు.. ఏడుపులు.. పెడబొబ్బలు.. ఏమోషన్స్.. రొమాన్స్ ఇలా ఎన్నో రకాలు వేరియేషన్స్ కనిపించడంతో ఈ షో బాగా ప్రేక్షకాదరణ పొందింది. అలాగే, కొన్ని వివాదాలు కూడా దీనికి మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ తరణంలో 'బిగ్ బాస్' ఎఫెక్ట్ గురించి మరో అప్‌డేట్ వచ్చేసింది.

    మెప్పించిన ఎన్టీఆర్

    మెప్పించిన ఎన్టీఆర్

    ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ షో తెలుగు బుల్లితెరపైకి వచ్చింది. అయితే, మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను హోస్టుగా తీసుకురావడంతో ఈ షోపై తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తి కనబరిచారు. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది కూడా. ఇందులో ఎన్టీఆర్ హోస్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు, టీఆర్పీ విషయంలోనూ రికార్డు క్రియేట్ చేశాడు తారక్.

    భారీ స్థాయిలో వ్యూస్

    భారీ స్థాయిలో వ్యూస్

    తారక్ హోస్టుగా చేసిన ‘బిగ్ బాస్' సీజన్ - 1 మొత్తానికి మంచి టీఆర్పీ వచ్చింది. ఆ షో ప్రారంభ ఎపిసోడ్ కు 16.1 టీఆర్పీ రేటింగ్ నమోదైంది. అలాగే ఫైనల్ ఎపిసోడ్‌కు కూడా 14.13 టీఆర్పీ వచ్చింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఈ ఎఫెక్ట్‌తో తారక్ పేరు మారుమ్రోగిపోయింది.

    నాని మెప్పించినా..

    నాని మెప్పించినా..

    ఇక, రెండో సీజన్‌లో నేచురల్ స్టార్ నాని హోస్టుగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ షోలో నాని మెప్పించినా.. తారక్ స్థాయిలో టీఆర్పీ తీసుకు రావడంలో సక్సెస్ కాలేకపోయాడు. సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు 15.5 రేటింగ్ నమోదైంది. దీంతో ఫైనల్ రికార్డు బద్దలవుతుందని అంతా అనుకున్నారు. అయితే, నాని మాత్రం తారక్‌ను దాటలేకపోయాడు.

    నాగ్ ఎంట్రీ - రికార్డు బద్దలు

    నాగ్ ఎంట్రీ - రికార్డు బద్దలు

    మూడో సీజన్‌కు నాగార్జున హోస్టుగా పరిచయం అయ్యాడు. ప్రోమోలతోనే షోపై ఆసక్తిని పెంచేశాడు. దీంతో ‘బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభ ఎపిసోడ్‌కు 17. 9 రేటింగ్ నమోదైంది. అంటే ఇప్పటి వరకు తారక్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. దీంతో ఫైనల్ కూడా అదే స్థాయిలో ఉంటుందేమోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

    గత అనుభవంతోనే..

    గత అనుభవంతోనే..

    నాగార్జున గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోను చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సామాన్య ప్రజల నుంచి ఈ షోలో పాల్గొనడానికి వచ్చే వాళ్లు. వాళ్లను నాగ్ బాగా డీల్ చేసేవాడు. అదే అనుభవం ఇప్పుడు ఆయనకు పనికొస్తుంది. చాలా ఈజీగా హోస్టింగ్ చేస్తూ ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాడు. మరి, ముందు ముందు ఈ షో ఎలా నడుస్తుందో చూడాలి.

    English summary
    Much to the happiness of the Telugu audiences, Bigg Boss Telugu 3 made a starry entry to the mini-screens on July 21, 2019. The third edition of the reality show that enjoys a dedicated fan base.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X