Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్ 4 లేటెస్ట్ ప్రోమో: వృద్ధ వయసులో నాగార్జున దొంగ చూపులు, ఆ తరువాత ఏం జరుగుతుందో?
మొత్తానికి బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సరికొత్త ప్రోగ్రామ్ మారికొన్ని రోజుల్లో భారీ రేటింగ్స్ అందుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక లేటెస్ట్ గా షోకి సంబంధించిన మరో ప్రేమో వదిలారు. చూస్తుంటే నాగార్జున ఈ సారి డిఫరెంట్ స్టైల్ లో ఆకట్టుకునేలా ఉన్నారు. ఇక ప్రోమో కొన్ని గంటల క్రితమే విడుదల అవ్వగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది.
|
నాగ్..గోడ మీద పిల్లిలా..
ఇక ప్రోమోలో నాగార్జున వృద్ధ వయసులో కనిపిస్తూ టెలిస్కోప్ తో దొంగ చూపులు చూసేస్తున్నట్లు ఉంది. మూసి మూసిగా నవ్వుకుంటూ.. గోపి అనేశారు. అంటే గోపి గోడ మీద పిల్లి అనేలా హౌజ్ లో జరుగే గొడవలు గేమ్ లు చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆమె క్యాప్షన్ తోనే షోకి మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నాగార్జున వేడెక్కించే టాస్క్ లు
ఇటీవల నాగార్జునకి సంబంధించిన కొన్ని ఫస్ట్ లుక్ లు ఆడియెన్స్ కి బాగానే నచ్చాయి. బిగ్ బాస్ 3వ సీజన్ ని ఓ వైపు కూల్ గానే నడిపించిన నాగార్జున మరోవైపు కంటెస్టెంట్స్ మధ్య వేడెక్కించే టాస్క్ లు కూడా ఉంచారు. దీంతో నాగార్జునకు జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యారు. నాని కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నాగ్ మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు.
తక్కువమంది టెక్నీషియన్స్ ద్వారా..
నాగార్జున పర్ఫెక్ట్ హోస్ట్ అని స్టార్ మా నిర్వాహకులు గత సీజన్ ఏండింగ్ లోనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకే భారీగా పారితోషికాన్ని అందిస్తూ కరోనా సమయంలో కూడా ఆయనతో హోస్టింగ్ చేయిస్తున్నారు. ఇక నాగార్జున కూడా చాలా కేర్ తీసుకొని షోను నిర్వహించనున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా చాలా తక్కువమంది టెక్నీషియన్స్ తో షోను నడిపించనుంది.
Recommended Video
హౌజ్ లోకి ఎంటర్ అయ్యే ముందు
ఇక ఆగస్ట్ ఏండింగ్ లోనే బిగ్ బాస్ 4 మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 105 నుంచి 115రోజుల వరకు షో నడిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయ్యింది. కొందరికి కరోనా టెస్టులు చేయించి క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే హౌజ్ లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.