For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: వివాదంలో కొత్త ట్విస్ట్.. అడ్డంగా దొరికిన లేడీ.. చేయని తప్పుకు భారీ శిక్ష

  |

  అంతకు ముందెన్నడూ చూడని కంటెంట్.. సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్ వీటన్నింటి కలయికే బిగ్ బాస్ షో. తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణు అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసిందిది. ఇలా ఒకటి కాదు రెండు చాలా సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున ఓ వివాదంపై క్లారిటీ ఇచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  చంటికి క్లాస్.. కెప్టెన్ కాకుండా ఓట్లు

  చంటికి క్లాస్.. కెప్టెన్ కాకుండా ఓట్లు

  నాలుగో వారానికి సంబంధించిన జరిగిన టాస్కుల్లో చాలా మంది చక్కగా పార్టిసిపేట్ చేశారు. కానీ, కొందరు మాత్రం నిరాశ పరిచారు. దీంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున వాళ్లకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. అంతేకాదు, ఆ తర్వాత కంటెస్టెంట్ల ఓట్ల ఆధారంగా ఈ సీజన్ మొత్తానికి అతడిని కెప్టెన్సీ టాస్కులో పాల్గొనకుండా నిర్ణయం తీసుకున్నారు.

  డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

  ఓటింగ్‌ వల్ల కొత్త వివాదంలో చంటి

  ఓటింగ్‌ వల్ల కొత్త వివాదంలో చంటి

  'బీబీ హోటల్' టాస్కులో బాలాదిత్య, ఆది రెడ్డి, చలాకీ చంటి, ఇనాయా సుల్తానా డబ్బు సంపాదించలేదు. ఇందులో చంటి, ఇనాయా కెప్టెన్ అవ్వకూడదంటూ మూడు ఓట్లు వచ్చాయి. వీళ్లిద్దరికీ టై అవడంతో కెప్టెన్ కీర్తి చంటికి ఓట్ వేసింది. ఆ సమయంలో అతడు తనను 'కెమెరాల కోసం పని చేస్తున్నానని అన్నారట. అందుకే ఓట్ వేశా' అని కొత్త వివాదాన్ని తీసుకొచ్చింది.

  చంటి అసహనం.. గీతూతో క్లారిటీగా

  చంటి అసహనం.. గీతూతో క్లారిటీగా

  తనను సీజన్ మొత్తానికి కెప్టెన్సీ టాస్కులో పాల్గొనకుండా చేసిన నిర్ణయంతో చలాకీ చంటి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ వెంటనే కొందరు హౌస్‌మేట్స్‌తో అతడు తన బాధను పంచుకున్నాడు. ఆ సమయంలోనే కీర్తి భట్‌ను పిలిచి మరోసారి క్లారిటీగా కనుక్కో అని చెప్పాడు. దీంతో ఆమె గీతూ దగ్గరకు వెళ్లగా.. మరింత కాన్ఫిడెంట్‌గా చంటీపై ఆరోపణలు చేసింది.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  నాగార్జున స్పందన.. క్లారిటీ అడిగి

  నాగార్జున స్పందన.. క్లారిటీ అడిగి

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో గత ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఇందులో సరదాగా ఉండాల్సిన నాగార్జున.. చంటీ - కీర్తి వివాదంతోనే మొదలు పెట్టాడు. ఇందులో ఎవరి తప్పు ఉంది అనే దానిపై ముందుగా హౌస్‌మేట్స్ అందరి వాదనలను చూశాడు. ఆ సమయంలో చాలా మంది చంటికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో గీతూ రాయల్ మరింతగా అతడిని తప్పుబట్టింది.

  ఆ వీడియో చూపించడంతో క్లారిటీ

  ఆ వీడియో చూపించడంతో క్లారిటీ

  చంటి - కీర్తి వివాదంలో పెద్దగా క్లారిటీ రాకపోవడంతో హోస్ట్ అక్కినేని నాగార్జున.. అసలేం జరిగిందో చూపించేందుకు వీడియోను ప్లే చేయించాడు. అందులో చంటి 'కెమెరాలు చూస్తున్నాయిగా' అని అన్నాడు. కానీ, గీతూ చెప్పినట్లు 'నాలుగు కెమెరాల్లో రికార్డు అయితే చాలులే' అని అనలేదు. దీని తర్వాత చంటీ పాజిటివ్ టోన్‌లోనే మాట్లాడడని క్లారిటీ వచ్చింది.

  యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

  గీతూ వీడియోను కూడా చూపించి

  గీతూ వీడియోను కూడా చూపించి

  ఈ వివాదాన్ని ఇంతటితో వదలని హోస్ట్ అక్కినేని నాగార్జున.. ఆ తర్వాత గీతూ రాయల్‌ను కీర్తి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది అనే వీడియో క్లిప్‌ను కూడా చూపించాడు. దీంతో చంటి ఒకలా అంటే.. గీతూ మరోలా చెప్పిందని అందరికీ అర్థం అయింది. దీంతో కీర్తి కూడా చంటికి సారీ చెప్పింది. ఆ తర్వాత అతడు నాగార్జునతో పాటు బిగ్ బాస్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

  చేయని తప్పునకు బలైన చంటి

  చేయని తప్పునకు బలైన చంటి

  వాస్తవానికి కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించే ఓటింగ్‌లో కీర్తి.. తనను చంటి కామెంట్ చేశాడని ఓట్ చేసింది. దీంతో అతడికి శిక్ష పడింది. అయితే, అసలు అతడు ఆమెను నెగెటివ్‌గా ఏమీ అనలేదని నాగార్జున ద్వారా అంతా తెలుసుకున్నారు. కానీ, అప్పటికే చంటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా గీతూ ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలకు చంటి బలైపోయాడు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Nagarjuna Clarifies Chalaki Chanti and Keerthi Bhat Issue in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X