twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 నిన్ను మించిన ఊసరవెళ్లి లేడు.. ఆదిరెడ్డికి క్లాస్ పీకిన నాగార్జున

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అనూహ్య పరిణామాలతో అటు హౌజ్ మేట్స్ కి.. ఇటు ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ 14వ వారం అంతా కోల్పోయిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి సంపాందించుకోవడాని ఛాలేంజ్ లో గట్టిగా పోటీ పడ్డారు ఇంటి సభ్యులు. వీటిలో ఎక్కువగా ఎంటర్టైన్ చేసింది డార్క్ రూమ్ (కన్ఫెషన్ రూమ్). ఇంటి సభ్యులంతా భయంతో కామెడీ పండించారు. ఇక ఈ వారం ఇంటి సభ్యుల ఆట తీరు, ప్రవర్తన తీరును సమీక్షించేందుకు హోస్ట్ నాగార్జున వచ్చేశారు. డిసెంబర్ 10 శనివారం నాటి 97వ రోజు ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

    కన్ఫెషన్ రూమ్ కి వచ్చేయండి..

    కన్ఫెషన్ రూమ్ కి వచ్చేయండి..

    ప్రోమోలో అదిరిపోయే డ్రెస్ తో ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. సయ్యారే సాంగ్ కు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. నాగార్జున షర్ట్, ఆయన్ని చూసి పచ్చని చెట్లతో కళకళలాడుతున్నారు అని శ్రీహాన్ అంటే.. నేను హీరోయిన్ ను కాదు కదా అని నాగార్జున సెటైర్ వేశారు. తర్వాత నవ్వేసిన నాగార్జున.. ఏడుగురు కన్ఫెషన్ రూమ్ కి వచ్చేయండని చెప్పడంతో ఇనయా, శ్రీ సత్య షాక్ అయ్యారు. మళ్లీ.. దెయ్యాల టాస్కా అని భయంగానే అడిగింది శ్రీ సత్య.

    ఎంటర్టైనింగ్ వీడియో ప్లీజ్..

    ఎంటర్టైనింగ్ వీడియో ప్లీజ్..

    ది మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియో ఆఫ్ ది సీజన్ అంటూ వీడియో వేయించారు హోస్ట్ నాగార్జున. ఆ వీడియోలో ఎవ్వడికైనా భయమేసుద్ది లోపల అని రోహిత్ తో ఆదిరెడ్డి చెప్పాడు. మా ఇద్దరికీ వేయలేదు.. నాకు శ్రీహాన్ కి. దెయ్యానికి పోయించాం అంటూ డిఫరెంట్ గా చేసి చూపించాడు ఆదిరెడ్డి. దానికి మిగతా ఇంటి సభ్యులంతా తెగ నవ్వేశారు. తర్వాత డార్క్ రూమ్ లో ఆదిరెడ్డిపై దెయ్యం వేషంలో ఉన్న వ్యక్తి పాము విసరడం చూపించారు.

     కావాలని చేయలేం కదా..

    కావాలని చేయలేం కదా..

    ఆదిరెడ్డి అరవడం, బిగ్ బాస్ శ్రీహాన్ ను పిలిస్తే భయంతో స్పందించడం చూసి హౌజ్ మేట్స్ తెగ నవ్వేశారు. డార్క్ రూమ్ లో శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్, ఇనయా భయపడిన సీన్స్ చూపించారు. తర్వాత నాది ఎందుకు సార్ వేయలేదు అని రేవంత్ అడిగితే.. నువ్ ఎక్కడ భయపడ్డావ్ అని నాగార్జున అన్నారు. కావాలనే ఎంటర్టైన్ చేయలేం కదా సార్ అని రేవంత్ అని కూర్చున్నాడు. అంటే శ్రీహాన్ కావాలనే అది చేశాడనా అని నాగార్జున అడిగారు. దీంతో షాక్ అయిన రేవంత్.. దండం పెడుతూ నాకు వద్దు సార్ వీడియో అని చెప్పాడు.

     నీకెందుకు ఓట్లు వేయాలి..

    నీకెందుకు ఓట్లు వేయాలి..

    ముందుగా అవతలి వాళ్ల కంటే అతను ఎందుకు బెటర్ అనే క్యాంపెయిన్ టాస్క్ ఉంది నాగార్జున చెబితే.. ఏదో ఫిటింగ్ పెడతారు కదా సార్ అని రేవంత్ అన్నాడు. క్యాంపెయిన్ టాస్క్ లో రేవంత్ అండ్ శ్రీహాన్ అని నాగార్జున చెప్పారు. శ్రీహాన్.. నువ్ రేవంత్ కన్నా ఎందుకు బెటర్, నీకెందుకు ఓట్లు వేయాలి.. నిన్ను ఎందుకు గెలిపించాలి అని నాగార్జున అన్నారు. దీనికి రేవంత్ లో ఉన్న మైనస్ లు చెప్పడం మొదలు పెట్టాడు శ్రీహాన్.

    అందరికీ మౌనమే సమాధానం..

    అందరికీ మౌనమే సమాధానం..

    ప్రతి ఇంటి సభ్యుడు ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తాడు. మనకు ఉండాల్సింది ఏంటంటే దాన్ని అంగీకరించడం. ఆ అంగీకరించడమనే క్వాలిటీ రేవంత్ లో ఎక్కడో ఓ చోట తక్కువ ఉందని నాకు అనిపించిందని శ్రీహాన్ అన్నాడు. దీనికి ప్రతి ఒక్కరికీ సైలెన్స్ (మౌనం) మంచి సమాధానం అనిపిస్తుంది సార్ అని రేవంత్ చెప్పాడు. సార్.. వెతుకుతుంటే ఇంకొక క్వాలిటీ కనపడింది.. చెప్పొచ్చా అని శ్రీహాన్ అడిగాడు.

    వెనుకాల మాట్లాడతాడని తెలుసు..

    వెనుకాల మాట్లాడతాడని తెలుసు..

    శ్రీహాన్ అన్నదానికి.. రేవంత్ ఫ్లిప్పర్ (ఊసరవెళ్లి) నేను కాదు అని అంటావ్ అంతేకదా అని నాగార్జున అన్నారు. దానికి ఛ.. ఛ.. కాదు సార్ అని శ్రీహాన్ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మొన్న ఆదిరెడ్డితో అదే కదా చెప్పింది అని నాగార్జున అనడంతో.. అయ్యా బాబోయ్ పెద్ద ఫ్లిప్పర్ అన్లేదు సార్ అని శ్రీహాన్ అంటుండగా.. నాకు తెలుసు సార్ శ్రీహాన్ వెనుకాల మాట్లాడుతాడని తెలుసు రేవంత్ అన్నాడు.

    నిన్ను మించిన వాళ్లు లేరు ఆది..

    రేవంత్ అలా అనడంతో శ్రీహాన్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు. దీంతో ఆదిరెడ్డి నీకు చెప్పాడా లేదా అని అడిగారు నాగార్జున. ఆదిరెడ్డి లేస్తూ ఫ్లిప్పర్ అన్నమాట గుర్తులేదు సార్ అని అనడంతో.. నిన్ను మించిన ఫ్లిప్పర్ (ఊసరవెళ్లి) లేడు ఆదిరెడ్డి అని నాగార్జున అన్నాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇలా ఇంట్రెస్టింగ్ గా ఇవాళ్టీ ఎపిసోడ్ ప్రోమో ముగిసింది. ఇదిలా ఉంటే 14వ వారం నామినేషన్ లో శ్రీహాన్ తప్పా మిగతా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు.

    English summary
    Bigg Boss Telugu 6 Nagarjuna Ready To Weekend Entertainment December 10 Episode Day 97 Promo 1 Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X