Bigg Boss Telugu 7: నువ్వు విన్నర్ కాదంటూ నాగార్జున డైరెక్ట్ హింట్.. ఎవరికిచ్చాడో, ఎప్పుడిచ్చాడో గుర్తించారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో మరింత అద్భుతంగా సాగుతోంది. మరో ఐదు రోజుల్లో ఈ షో ముగిసిపోతుండడంతో మరింత ఆసక్తిగా షో చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇప్పటికే 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ఆదివారంతో అయిపోతుండగా.. విన్నర్ ఎవరో, రన్నరప్ ఎవరో టాప్ 5లో ఎవరెవరు ఉండబోతున్నారో తెలియనుంది. అయితే ఈ ఆదివారం బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చిన నాగార్జున సీక్రెట్ గా టాప్ 5 కంటెస్టెంట్ కు ఓ హింట్ ఇచ్చేశాడు. అయితే ఆ హింట్ ఏంటి ఎవరికి ఆ హింట్ ఇచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి వారంలో వచ్చిన శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, అలాగే ఐదో వారంలో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంబటి అర్జున్ కూడా టాప్ 6లోకి వచ్చేశాడు. ఫినాలే అస్త్ర గెలుచుకుని వచ్చిన ఆయన మొదటి వారం నుంచి ఇంట్లో ఉన్న వాళ్లకి గట్టి పోటీని ఇచ్చాడు. అయితే టాప్ 6లో ఉన్న వాళ్లలో ఈ వారంలోనే టాప్ 1 ఎవరు, రన్నరప్ ఎవరు అని తెలియనుంది. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం... టాప్ 1లో పల్లవి ప్రశాంత్, టాప్ 2 లో ప్రిన్స్ యావర్, టాప్ 3లో శివాజి, టాప్ 4లో అమర్ దీప్ లు ఉన్నారు.

Nagarjuna Direct Hint to Amardeep That You Are Not a Winner in Bigg Boss TElugu 7

అయితే మొన్నటి వరకు టాప్ 3లో.... అమర్ దీప్, శివాజి, పల్లవి ప్రశాంత్ లు ఉన్నారు. వీరి ముగ్గురిలోనే ఎవరో ఒక్కరు విన్నర్ గా నిలుస్తారని అందరూ భావించారు. కానీ 14వ వారంలో అటు శివాజిని, ఇటు అమర్ దీప్ ను ఫుల్ నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నాగార్జున అయితే ఫన్నీ టాస్క్ ఇచ్చి తన మనసులోని భావాలను డైరెక్ట్ గా మొహంపై చెప్పేశారు. ముఖ్యంగా కొందరికి నీకంతా సీన్ లేదంటూ సింపుల్ గా నువ్వు విన్నర్ గా నిలవని అన్నాడు. మీమ్స్ టాస్క్ లో భాగంగా పాపులర్ మీమ్స్ డైలాగ్ లను ఎవరికి సూట్ అవుతాయే వాళ్లకి పెట్టాలని ఇంటి సభ్యులకు చెప్పారు నాగార్జున.

Nagarjuna Direct Hint to Amardeep That You Are Not a Winner in Bigg Boss TElugu 7

ముఖ్యంగా సర్ సర్లే ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి అనే మీమ్ ను శివాజి అమర్ దీప్ కు చెప్పాడు. ఇదే సమయంలో నాగార్జున ఇది నీకు బాగా సూట్ అవుతుందయ్యా అని అమర్ దీప్ కు చెప్పారు. నువ్వు చాలా అనుకున్నావు అన్నీ జరుగుతాయా ఏంటి అంటూ అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఆయన అనుకున్నది జరగదని చెప్పినట్లు తెలుస్తోంది. కెప్టెన్ కావాలని ఎంతో ప్రయత్నించగా... చివరి వరకూ కాకపోవడంతో నాగార్జుననే ప్రీగా కెప్టెన్ ను చేసేశారు. ఎలాంటి గేమ్ లేకుండానే వారం రోజుల పాటు ఇంటికి హెడ్ ను చేశారు.

Nagarjuna Direct Hint to Amardeep That You Are Not a Winner in Bigg Boss TElugu 7

ఇక అమర్ దీప్ ధ్యాస అంతా కప్పు మీదే ఉంది. ఎలాగైనా సరే ఈ సీజన్ విన్నర్ కావాలని ఫుల్ గా కష్టపడుతున్నారు. ఈ సమయంలోనే నాగార్జున అలా అనడంతో ఈయన విన్నర్ కాదని తేలిపోయింది. ఈ ఒక్కమాటే కాకుండా నీవు మీమ్ నమెటీరియల్ వి ఉంటూ మరికొన్ని కామెంట్లు చేశారు. నవ్వుతూ నవ్వుతూ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓసారి క్లియర్ గా చూస్తే ఈ విషయం మీక్కూడా అర్థం అయిపోతుంది. ప్రస్తుతం ఓటింగ్ లిస్ట్ లో టాప్ లో ఉన్నది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ ఏదైనా మాయ చేస్తే తప్ప రైతుబిడ్డ విన్నర్ కావడం ఖాయం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X