Bigg Boss 7 Telugu: టేస్టీ తేజకు నాగార్జున శిక్ష.. ఎవరూ నామినేట్ చేయకుండానే.. తొలి కంటెస్టెంట్ ఇతడే
తెలుగు టెలివిజన్ హిస్టరీలో కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా ఘనతను అందుకుంది బిగ్ బాస్. విచిత్రమైన కాన్సెప్టు, సరికొత్త టాస్కులు, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన యాంగిల్స్‌ను చూపిస్తూ ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇలా ఇటీవలే నిర్వహకులు ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో టేస్టీ తేజకు నాగార్జున ఓ శిక్ష విధించాడు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పటికే మూడు వారాలు పూర్తవగా సందీప్, శివాజి, శోభా శెట్టి మాత్రం పవర్ అస్త్రాలను సాధించి కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ క్రమంలోనే నాలుగో వారానికి సంబంధించి పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకర్స్ టాస్కుకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి రౌండ్‌లో అమర్‌దీప్, గౌతమ్‌లు రతికా, తేజపై గెలిచి సత్తా చాటారు.

ఈ రౌండ్ జరిగే సమయంలో టేస్టీ తేజ.. గౌతమ్ కృష్ణను బెల్టుతో పలుమార్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ సంఘటనపై తనదైన రీతిలో స్పందించాడు. ముందుగా బెల్ట్ పట్టుకునే స్టేజ్ మీదకు వచ్చిన అతడు.. టేస్టీ తేజ బెండు తీసేలా వాయించేశాడు.
ముఖ్యంగా ఈ టాస్కులో టేస్టీ తేజ కావాలనే గౌతమ్ కృష్ణను కొట్టినట్లు అనిపించిందన్న నాగార్జున.. దీనిపై హౌస్‌మేట్ల అభిప్రాయం తీసుకున్నాడు. ఇందులో అందరూ అతడు తప్పు చేసినట్లు చెప్పారు. ఫలితంగా టేస్టీ తేజకు ఏ శిక్షను విధించాలి అని ప్రతి ఒక్కరినీ అడిగాడు. అందులో కొందరు కొన్ని రకలా పనీష్‌మెంట్లు చెప్పగా.. సందీప్ మాస్టర్ అయితే ఎలిమినేట్ చేయాలన్నాడు.
అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత హోస్ట్ నాగార్జున.. టేస్టీ తేజకు జైలు శిక్షను విధిస్తున్నట్లు చెప్పాడు. అదే సమయంలో జైలులో ఉన్నా గౌతమ్ కృష్ణ చెప్పిన ప్రతి పనినీ చేయాల్సి ఉంటుందని అన్నాడు. మరీ ముఖ్యంగా ఐదో వారానికి గానూ టేస్టీ తేజను నేరుగా నామినేట్ చేసేశాడు. తద్వారా ఒకేసారి జైలు, నామినేషన్‌కు వచ్చిన కంటెస్టెంట్‌గా అతడు నిలిచాడు.
ఇక, ఈ సంఘటన జరిగే సమయంలో అక్కడే ఉన్నా మాట్లాడని సందీప్ మాస్టర్‌పై నాగార్జున ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు. 'నువ్వేమైనా గుడ్డి వాడివా? అంత జరుగుతున్నా కనిపించలేదా' అంటూ ప్రశ్నించాడు. అలాగే, మరో సంచాలకుడు శివాజిని సైతం నాగార్జున గట్టిగానే మందలించాడు. ఈ విషయంలో సంచాలకులు ఇద్దరూ తప్పు చేశారని చురకలు అంటించాడు.
చివర్లో టేస్టీ తేజ అంతలా కొట్టినా ఏమాత్రం రియాక్ట్ అవకుండా కూల్‌గా వ్యవహరించిన గౌతమ్ కృష్ణను హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నాడు. ఆ సమయంలో తనకు అతడు 'జెంటిల్‌మెన్'లా అనిపించాడని ప్రశంసించాడు. మొత్తానికి ఈ ఘటనపై హోస్ట్ నాగార్జున వ్యవహరించిన తీరుకు నెటిజన్లు అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











