twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లకు క్లాస్ పీకిన నాగ్.. సిగ్గుపడి తల దించుకుంది.. చివరకు ట్విస్ట్.. ఈ ఎలిమినేషన్ కొంచెం కొత్తగా!

    |

    తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' మూడో వారాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే హేమ, జాఫర్ తొలి రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వగా.. మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి తొలి రెండు వారాల్లో శనివారమే ఎవరు సేఫ్ అయ్యారనేది చెప్పిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. ఈ సారి మాత్రం అలా చేయలేదు. అంతేకాదు, కొద్దిరోజులుగా గొడవలు పడుతున్న కంటెస్టెంట్లందరికీ అదిరిపోయే రీతిలో క్లాస్ పీకాడు. అదే సమయంలో వాళ్లను కలిపే ప్రయత్నమూ చేశాడు. చివరకు మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు.

    వచ్చీ రావడంతోనే క్లాస్

    వచ్చీ రావడంతోనే క్లాస్

    ‘బిగ్ బాస్' షో మూడో వారంలో పలు సంఘటనలు ఎంతో హైలైట్ అయ్యాయి. వాటిలో నామినేషన్ సమయంలో పునర్నవి చేసిన హడావిడి, తమన్నా.. రవికృష్ణతో ప్రవర్తించిన తీరు, కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీముఖి డంబెల్‌తో పగలగొట్టడం.. రవికి గాయం కావడం, అదే సమయంలో అలీ రేజా.. హిమజతో గొడవ పడడం, రాహుల్.. శ్రీముఖిని తిట్టడం.. ఇలా కొన్ని ఘటనలు జరిగాయి. వీటన్నింటిపై సీరియస్‌గా ఉన్న నాగార్జున కారకులకు క్లాస్ పీకాడు.

    నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ...

    నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ...

    నాగార్జున మొదట అలీతో మాట్లాడాడు. ‘అలీ.. నీకు డ్రెస్ సెన్స్ బాగుంది కానీ, కామన్ సెన్స్ లేదయ్యా. ఆడపిల్ల మీద అలాగేనా అరిచేది. నువ్వు ఏకంగా ఆడపిల్ల జేబులో చెయ్యి పెట్టేసి డబ్బును టక్కున లాక్కుంటున్నావు. తనకు ఇష్టం లేకుండా మగాడు ఎవడైనా ఆడపిల్లపై చేయ్యేస్తే తన్నుతుంది. అలాంటిది నువ్వు చెయ్యి వేసి ఆమెపైనే వ్యక్తిగత దూషణకు దిగావు. ఆమె నీకు బయట తెలిసి ఉండొచ్చు. కానీ, ఆ విషయాలేవీ బిగ్ బాస్ షోలోకి తీసుకురాకూడదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు' అనడంతో అలీ సారీ చెప్పాడు.

    తమన్నాను కూడా..

    తమన్నాను కూడా..

    గత వారం జరిగిన మొత్తం ఎపిసోడ్స్‌లో తమన్నా.. రవికృష్ణతో వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో నాగ్ ‘తమన్నా.. నువ్వు అందరికీ ఆదర్శంగా ఉంటానన్నావు. కానీ, చేసింది ఏమిటి..? రవితో అలానా ప్రవర్తించేంది..? హౌస్‌మేట్స్ అందరూ తమన్నా ప్లీజ్ స్టాప్.. ఆగు ఆగు.. అన్ని మాటలు అనొద్దు అని చెబుతూనే ఉన్నారు. అయినా నువ్వు ఎవ్వరినీ పట్టించుకోలేదు. ఒక టైంలో ఆ బాధను తట్టుకోలేక బాబా భాస్కర్‌ను పట్టుకుని రవి ఏడ్చాడు' అంటూ క్లాస్ పీకాడు.

    జర్నలిస్టులకు సారీ చెప్పించాడు

    జర్నలిస్టులకు సారీ చెప్పించాడు

    తమన్నా.. రవి విషయంలో మాత్రమే కాదు.. శివ జ్యోతిని ప్రస్తావిస్తూ జర్నలిస్టులపైనా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోను ప్లే చేయించిన నాగార్జున.. ఆమెతో జర్నలిస్టులకు సారీ చెప్పించాడు. నీకు ఎన్నో సార్లు అండగా ఉన్న జర్నలిస్టులను అలా అంటావా అంటూ క్లాస్ పీకుతున్న సమయంలో తమన్నా సిగ్గుపడి తల దించుకుంది.

    రాహుల్ ఫాల్త్ మాటలు మాట్లాడకు

    రాహుల్ ఫాల్త్ మాటలు మాట్లాడకు

    రాహుల్.. శ్రీముఖిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ‘అందరూ శ్రీముఖి మీద పడ్డారు. శ్రీముఖి డంబెల్ ఇచ్చి కొట్టింది అని. రాహుల్ కూడా ఫాల్తు మాటలు చాలా మాట్లాడాడు. రాహుల్ ఇది ఆఖరి వార్నింగ్.. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఫాల్తు మాటలు మాత్రం వద్దు' అని హెచ్చరించాడు.

    వితిక, పునర్నవి, రవిని కూడా..

    వితిక, పునర్నవి, రవిని కూడా..

    వాళ్లను మాత్రమే కాదు.. రవికి గాయమైనా డబ్బులు దాచిన తర్వాత అతడిపై జాలి చూపించిందని వితిక వీడియో ప్లే చేయించాడు నాగ్. అలాగే, పునర్నవికి కూడా కోపం తగ్గించుకుని ఉండాలని, బిగ్ బాస్ రూల్స్ పాటించాలని చెప్పాడు. ఇక, రవిని మాత్రం తమన్నా విషయంలో అంత ఓపికగా ఉన్న వాడివి గ్లాస్ ఎందుకు పగలగొట్టావు అని నవ్వుకున్నాడు.

    కోఆర్డినేషన్ గేమ్

    కోఆర్డినేషన్ గేమ్

    అప్పటి వరకు సీరియస్ అయిన నాగార్జున వాళ్లన కూల్ చేయడంతో పాటు హౌస్‌లో విడిపోయిన వారిని కలపడం కోసం కోఆర్డినేషన్ గేమ్ ఆడించాడు. ఇందులో ఇద్దరు వెనుకకు తిరిగి నిల్చుంటే వాళ్ల మధ్యలో బెలూన్ పెట్టారు. వాళ్లిద్దరూ బెలూన్ ఎగిరిపోకుండా కలిసి వెళ్లి స్టోర్ రూమ్‌లో వాళ్ల కోసం ఉంచిన ఒక వస్తువును తెచ్చుకోవాలి. ఈ గేమ్‌లో పునర్నవి-బాబా భాస్కర్ మాత్రమే గెలవడం విశేషం.

     ఎలిమినేషన్ ట్విస్ట్

    ఎలిమినేషన్ ట్విస్ట్

    ఎవరు ఎలిమినేషన్ అవుతారన్న దానిపై నాగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గత వారం నామినేట్ అయిన పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు, తమన్నాలను తమ లగేజ్ మొత్తాన్ని సర్దుకుని స్టోర్ రూంలో పెట్టాలని నాగార్జున సూచించారు. వాళ్లంతా తమ లగేజీలను స్టోర్ రూంలో పెట్టేశారు. స్టోర్ రూంలో ఎవరి లగేజ్ అయితే ఉండదో వారు ఈ షో నుంచి ఎలిమినేట్ అయినట్టని నాగార్జున చెప్పారు. అశురెడ్డిని వెళ్లి చెక్ చేసి రమ్మన్నారు. అయితే, స్టోర్ రూంలో ఒక్కరి లగేజ్ కూడా లేదు. అంటే దానర్థం ఆదివారం తెలుస్తుంది అని.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X