Bigg Boss Telugu 7: టాప్ 4 ఎవరో చెప్పేసిన నాగార్జున.. శివాజి పరువు తీసేలా.. వాళ్లకూ కోలుకోలేని షాక్
తెలుగు బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎనిమిదో వారంలో నామినేషన్స్ నుంచే ఎన్నో రకాల గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెడర్ల టాస్కులోనూ పలువురి మధ్య వాదనలు కనిపించాయి. కెప్టెన్సీ టాస్కులో అయితే కొట్టుకుంటారా అన్నట్లుగా కొందరు ప్రవర్తించారు. దీంతో శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వీటన్నింటినీ ప్రస్తావిస్తూ క్లాసులు తీసుకున్నాడు.

గత వారంలో శోభా శెట్టి - ప్రిన్స్ యావర్‌ను పిచ్చోడు అని సంబోధించింది. దీనిపై నాగార్జున సీరియస్ అయ్యాడు. 'భోలే నిన్ను ఎర్రగడ్డ అన్నందుకే ఫీలైపోయావు. మరి ప్రిన్స్‌ను పిచ్చోడు అని ఎలా అన్నావు' అని ప్రశ్నించాడు. అలాగే, యావర్‌ను 'నువ్వు నిజంగానే పిచ్చోడిలా ప్రవర్తించావు' అంటూ షాకిచ్చాడు. అలా ఇద్దరికీ చాలా సేపు క్లాస్ పీకి చేతులు కలిపించాడు.
అనంతరం నామినేషన్స్ టాస్కులో అమర్‌దీప్ చౌదరి కుర్చీని కాలితో తన్నడం, ప్రశాంత్‌ను 'ఈ నా కొడుకు' అనడంపైనా నాగార్జున ఫైర్ అయ్యాడు. అప్పుడు అతడికి ఓ రేంజ్‌లో ఇచ్చి పడేయడంతో పాటు పక్కనే ఉన్న ప్రియాంకకు కూడా క్లాస్ పీకాడు. అమర్ తప్పు చేసినా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. చివరకు ఇద్దరూ సారీ చెప్పడంతో దీనికి ముగింపు పలికాడు.
ఆ తర్వాత సందీప్ మాస్టర్ అన్న 'బొంగు' అనే పదాన్ని నాగార్జున సీరియస్‌గా తీసుకున్నాడు. 'ఇప్పుడు బొంగులో డ్యాన్సర్‌తో మాట్లాడదాం. నువ్వు బొంగులో సమాధానాలు చెప్పకు' అంటూ పదే పదే అదే పదాన్ని వాడుతూ సందీప్ మాస్టర్‌కు షాక్ ఇచ్చాడు. దీంతో చేసేదేం లేక అతడు సైలెంట్‌గా ఉండిపోయాడు. మొత్తానికి ఆ మాట వాడడం తప్పేనని ఒప్పుకున్నాడు.
ఈ ఎపిసోడ్‌లో శివాజిపైన కూడా హోస్ట్ నాగార్జున సీరియస్ అయ్యాడు. అంతేకాదు, 'ఎవరో ఒకరిని కొట్టి వెళ్లిపోతా' అని అతడు అన్న వీడియోను కూడా ప్లే చేశాడు. ఆ తర్వాత ఎందుకిలా అన్నావని ప్రశ్నించాడు. దీనికి శివాజి సేఫ్‌గా సమాధానాలు చెప్పాడు. దీంతో నాగార్జున 'నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అక్కడ పెద్దోడివి. మంచి చెడు నువ్వే చెప్పాలి' అన్నాడు.
అనంతరం నామినేషన్స్‌లో ఉన్న వారిని సేవింగ్ సమయంలో శివాజిని.. నాగార్జున 'సోఫాజీ' అని పిలిచాడు. తద్వారా ఎప్పుడూ సోఫాలోనే ఉంటున్నావు అంటూ పరోక్షంగా చెప్పి పరువు తీసేశాడు. వీళ్లు మాత్రమే కాదు.. రతికా రోజ్, టేస్టీ తేజకు కూడా నాగార్జున క్లాసులు తీసుకున్నాడు. భోలే షావలి మాత్రం వ్యక్తిత్వం పరంగా ఆకట్టుకుంటున్నాడని ప్రశంసించాడు.
ఎనిమిదో వారం మొత్తంలో కేవలం నలుగురు మాత్రమే మంచిగా ఆడారని చెబుతూ వాళ్ల జెండాలను పాతాడు. అందులో అంబటి అర్జున్, పల్లవి ప్రశాంత్, అశ్వినీ శ్రీ, ప్రియాంక జైన్‌లు ఉన్నారు. ఈ నలుగురే గత వారానికి టాప్ 4 అని పేర్కొన్నాడు. ఇలా హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో కొందరిపై కారాలు మిరియాలు నూరి.. కొందరిపై ప్రశంసలు కురిపించాడు.


Click it and Unblock the Notifications











