Bigg Boss 7 Telugu: వీడియో చూపించిన నాగార్జున.. బొక్కలో జడ్జ్‌మెంట్ అంటూ.. శివాజి, ప్రశాంత్‌ను కూడా!
దేశ వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లోనూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అయితే, అన్నింటి కంటే ఎక్కువ ఆదరణను అందుకుంటూ నేషనల్ రికార్డులను బద్దలు కొడుతోన్నది మాత్రం తెలుగు షోనే అని చెప్పాలి. ఇది మన దగ్గర ఎంతో సక్సెస్ అయింది. అందుకే ప్రతి ఏడాది ఒకటి చొప్పున ఏకంగా ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ప్రారంభమై ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో కొందరు కంటెస్టెంట్లపై నాగార్జున సీరియస్ అయ్యాడు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి. కంటెంట్ కూడా పూర్తి భిన్నంగా ఉంటోంది. అందుకే ఐదో వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును నడిపారు. దీన్ని పలు రౌండ్లలో నిర్వహించారు. ఇందులో పల్లవి ప్రశాంత్ విజయం సాధించి మొదటి కెప్టెన్‌గా నిలిచాడు.

ఈ వారం మొత్తంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ రౌండ్లలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. కొందరు కంటెస్టెంట్లు ఓవర్ యాక్షన్ కూడా చేశారు. అలాంటి వారికి శనివారం జరగనున్న ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో ముందుగా ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ చక్కగా ఆడారని నాగ్ మెచ్చుకున్నాడు.
శనివారం ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్స్ టాస్కులో మాదిరిగా ఓ షీటుపై కంటెస్టెంట్ల బొమ్మలతో ఉన్న కత్తులను గుచ్చుతూ అందరి ఆట తీరును రివ్యూ చేశాడు. వాటిని గుచ్చితే తప్పు చేసినట్లు, గుచ్చకపోతే చేయనట్లు అని వివరించాడు. ముందుగా నాగార్జున 'మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది' అంటూ ప్రిన్స్, తేజను ప్రశంసించాడు.
ఆ తర్వాత అమర్‌దీప్ చౌదరి, సందీప్ మాస్టర్ జోడీని లేపి వాళ్లపై నాగార్జున ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు. ఈ వారం మొత్తంలో ఈ టీమ్ చేసిన తప్పులను ప్రస్తావిస్తూ క్లాస్ పీకేశాడు. ముఖ్యంగా బత్తాయి టాస్కులో సందీప్ మోసం చేయడాన్ని వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అప్పుడు సంచాలకుడిగా ఉన్న అమర్‌దీప్‌పైనా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంతేకాదు, 'అమర్ నువ్వు వేరే వాళ్లు సంచాలకులుగా ఉన్నప్పుడు బొక్కలో జడ్జ్‌మెంట్ అంటుంటావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు తొక్కలో సంచాలక్.. నీది బొక్కలో జడ్జ్‌మెంట్' అంటూ అతడి పరువు తీసేశాడు. వీళ్లను మాత్రమే కాదు.. శోభా శెట్టి - ప్రియాంక, శుభశ్రీ - గౌతమ్, శివాజి - ప్రశాంత్‌ను సైతం నాగార్జున తిట్టినట్లు తెలిసింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.


Click it and Unblock the Notifications











