Bigg Boss Telugu 7: టైటిల్ ఫేవెరట్ కోసం నాగార్జున షాకింగ్ డెసీషన్.. చేతిపై బాటిల్ పగలగొట్టుకొని రచ్చ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఏ ముహూర్తాన బిగ్ బాస్ ప్రారంభం అయిందో కానీ అద్భుతమైన టీఆర్పీతో దుమ్మరేపుతోంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరినీ రాత్రి 9గంటలు అయిందంటే చాలు టీవీల ముందు కూర్చోబెడుతుంది. ఇంకొన్ని వారాల్లో బిగ్ బాస్ షో ముగుస్తుండడంతో ఎవరు గెలుస్తారని ఎక్కువ మంది ఈ షో చూస్తున్నారు. తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూనే నచ్చని వారు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారు.
అయితే 11వ వారం నామినేషన్లలో భాగంగా కొన్ని మట్టి బాటిల్స్ ఇఛ్చి ఎవరిని అయితే కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి తలలపై పగులగొట్టాలని బిగ్ బాస్ సూచించారు. ఈక్రమంలోనే అందరూ తమకు నచ్చని వారి తలలపై బాటిల్స్ పగులగొట్టారు. ఈక్రమంలోనే అశ్వినిని నామినేట్ చేసిన ప్రియాంక జైన్ ఆమె తలపై బాటిల్ పగులగొట్టింది. వెంటనే అశ్విని.. ఏంటి ప్రియాంక ఇది ఇంత గట్టిగా కొట్టావంటూ రచ్చ చేసింది. నిజంగానే నీకు నాపై కోపం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఏపిసోడ్ తర్వాత సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగింది.

నిజంగానే ప్రియాంక జైన్.. అశ్విని శ్రీని చాలా కోపంగా కొట్టిందని చాలా మంది రాసుకొచ్చారు. అంతేనా ఆ వీడియోను కూడా ఫుల్ వైరల్ అయ్యేలా చేశారు. అయితే ఆ వీడియో చూస్తే నిజంగానే ప్రియాంక కోపంగా కొట్టినట్లు చూసిన వాళ్లకు అనిపిస్తుంది. అప్పటికే ఆమెతో వాదించి ఉండడంతో మొహం అలా పెట్టుకుంది తప్పితే ప్రియాంక అంత గట్టిగా ఏమీ కొట్టలేదు. అలాగే అంతగా దెబ్బ తగిలేందుకు అవేమీ మట్టి బాటిల్స్ కూడా కాదు. చక్కెరతో చేసిన బాటిల్స్. ఎవరికీ ఏమీ కాదు కాబట్టే.. ముఖ్యంగా అసలేమాత్రం దెబ్బ తగలదు కాబట్టే బిగ్ బాస్ ఆ బాటిల్స్ తో కొట్టుకోవాలని చెప్పారు.
నిజంగానే దెబ్బ తగిలే బాటిల్సే అయితే బిగ్ బాస్ అసలు పంపించే వారే కాదు. కానీ నెట్టింట మాత్రం అంతా అశ్వినికి తోడుగా ఉండగా.. తాజాగా నాగార్జున బిగ్ బాస్ ముద్దుబిడ్డ, టైటిల్ ఫేవరెట్ అయిన ప్రియాంక జైన్ కు సపోర్ట్ చేశారు. అయితే ఇదంతా ఈరోజుటి ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా అశ్వినిని లేపిన నాగార్జున నిజగానే దెబ్బ తగిలలిందా అనగా.. హా గట్టిగా తగిలింది సార్ అని చెబుతుంది. వెంటనే నాగార్జున ఓ బాటిల్ ను తీసి తన చేతిపై పగుల గొట్టుకున్నాడు. చూడు నాకేం కాలేదు... కనీసం నా చేతిపై జుట్టు కూడా లేదని చెప్పాడు.

నిజంగా దెబ్బ తగిలే బాటిల్సే అయితే బిగ్ బాస్ పంపరు కదా అంటూ నాగార్జున అశ్వినికి క్లాస్ పీకగా... ఏమో సార్ నాకైతే దెబ్బ తగిలింది.. ఆ బాటిల్ ఎలా ఉందో కూడా తెలియదు కానీ నొప్పి అయితే వచ్చిందంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఏం అనాలో తెలియక నాగార్జున కూడా వెటకారంగా నవ్వుతూ.. అశ్వినిశ్రీకి హాట్సాఫ్ చెప్పాడు. ఇదంతా చూస్తున్న కంటెస్టెంట్లు మాత్రం చాలా సీరియస్ గా ఉండిపోయారు. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ వస్తే.. ఇంకెంత గట్టిగా అశ్వినికి క్లాస్ పడిందో తెలుస్తుంది.



Click it and Unblock the Notifications











