Bigg Boss Telugu 7: గౌతమ్‌కు గట్టిగా పడిందిగా.. టాప్-5లో ఉంచే ఉద్దేశమే లేనట్లుంది, టైటిల్ ఫేవరెట్లు వాళ్లే!

Nagarjuna Fires on Gautam: ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతమైన టీఆర్పీతో అందరి మనసులను గెలుచుకుంటోంది. ముఖ్యంగా నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ తో పాటు నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతుంది. అయితే తాజాగా వచ్చిన శనివారం ఎపిసోడ్ లో నాగార్జున చాలా మందిని పొగడగా.. కొందరికి మాత్రం గట్టిగా ఇచ్చి పడేశాడు. ఇందులో భాగంగానే ఈ ఈవారం కెప్టెన్ గా కొనసాగిన గౌతమ్ కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివాజి, భోలె షవాళి విషయంలో అతడు చేసిన తప్పులను అతడికే తెలిసేలా చేశారు.

శుక్రవారం ఎపిసోడ్ నుంచి గౌతమ్ కృష్ణ.. శివాజిపై ఆగ్రహంగా ఉన్నాడు. శివాజి కావాలనే తాను కెప్టెన్ కాకుండా చేశాడని, ప్రతీ విషయంలో అతడిని తొక్కాలని చూస్తున్నట్లు భావించాడు. ఈక్రమంలోనే కెమెరాల ముందుకు వచ్చి మరీ నాదేమైనా తప్పు ఉంటే నన్ను ఎలిమినేట్ చేయండి అని చెప్పాడు. అశ్వినితో మాట్లాడుతూ కూడా.. జనాలు చూస్తున్నారు, శివాజి నాపై కావాలనే పగ పెంచుకుంటున్నారంటూ మాట్లాడాడు. నాగార్జున వచ్చాకా నేనే ఈ విషయం గురించి అడిగి తేల్చుకుంటానని అన్నాడు.

Nagarjuna Fires on Gautam Krishna About Sivaji and Bhole Issues

అన్నట్లుగానే శనివారం రోజు నాగార్జునతో గౌతమ్ కృష్ణ మాట్లాడాడు. తనకు శివాజిపై ఉన్న అలిగేషన్స్ ను చెప్పాడు. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్కులో తన బ్యాగ్ ఎవరూ తీసుకోవద్దని.. శివాజి ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లి చెప్పాడని ఆరోపించాడు. అలాగే తాను చేసే ప్రతీ పనికి అడ్డు వస్తూ తనను తొక్కేయాలని చూస్తున్నాడని నాగార్జునకు వివరించాడు. అదేం లేదని నాగార్జున అర్థం అయ్యేలా చెప్పినా గౌతమ్ వినకపోవడంతో.. హౌస్ మేట్స్ తోనే ఈ విషయం మాట్లాడదామని, క్లారిటీ తెచ్చుకుందామని చెప్పాడు. బయటకు తీసుకువచ్చి అందరి ముందు ఈ విషయం గురించి మాట్లాడాడు.

ముఖ్యంగా శివాజి టీం సభ్యులందరినీ పిలిచి.. శివాజి కావాలని ప్రతీ ఒక్కరి దగ్గరకు వచ్చి గౌతమ్ కృష్ణ బ్యాగ్ తీసుకోవాలని సూచించాడా అని అడగ్గా.. అంతా లేదని చెప్పారు. అలాగే గౌతమ్ కృష్ణకు శివాజి అన్యాయం చేశాడని అనిపించిన వాళ్లు చేయి ఎత్తాలి అనగానే ఒక్క అశ్విని మాత్రమే ఎత్తింది. మిగతా వారెవరూ ఎత్తలేదు. శివాజి అలా ఏం చేయలేదని అది టీం డిసీషన్ అని చెప్పారు. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం అందుకు సాటిట్ ఫై అవ్వలేదు. ఇదంతా గమనించిన నాగార్జున గట్టిగానే గౌతమ్ కు ఆన్సర్ చెప్పాడు.

Nagarjuna Fires on Gautam Krishna About Sivaji and Bhole Issues

శివాజి అలా చేయలేదు.. కానీ అలా చేశాడని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి... నువ్వు కూడా భోలె విషయంలో అదే చేశావు కదా అని అడిగాడు. దీనికి ఆయన టీం సభ్యులు అంతా అవును గౌతమ్ పక్కకు తీసుకెళ్లి మరీ భోలెను పంపించేద్దామని అన్నాడని చెప్పారు. దీంతో గొడవ ముగిసింది. శివాజి, భోలెల తప్పు ఏం లేదని నాగార్జున చెప్పాడు. అలాగే గౌతమ్ కృష్ణ ఆరోపణలు అన్ని అవాస్తవం అని వెల్లడించాడు. ఇదంతా చూస్తుంటే.. గౌతమ్ కృష్ణను టాప్ -5లో ఉంచే ఉద్దేశం లేదని బిగ్ బాస్ టీంకు ఉన్నట్లు అర్థం అవుతోంది. అంతేకాకుండా టాప్ 5 లో పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ ఉంటారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X