Bigg Boss Telugu 7 యావర్ రియల్ క్యారెక్టర్ ఇదేనా? ఛీ తూ.. ఛీఛీ అంటూ నాగార్జున ఫైర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్భుతమైన టాస్క్ లతో పాటు అంతకు మించిన ఎమోషన్స్ వచ్చేలా చేయడంలో, కంటెస్టెంట్లు విపరీతంగా కొట్టుకునేలా చేయడంలో బిగ్ బాస్ టీం నిర్వాహకులు సఫలం అవుతున్నారు. కంటెస్టెంట్లు కొట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ చేసే రచ్చ చూసేందుకు అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 13 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో రేపటితో 14వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది.
అయితే బుల్లితెర ప్రేక్షకులు అంతా ముఖ్యంగా బిగ్ బాస్ షో అభిమానులు అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసే ఎపిసోడ్ రానే వచ్చేసింది. నామినేషన్స్ జరిగే రోజుతో పాటు వీకెండ్ ఎపిసోడ్స్ ను చాలా మంది విపరీతంగా ఇష్ట పడుతుంటారు. అయితే వారం మొత్తం జరిగిన సంఘటనలను చూసిన నాగార్జున... తప్పు చేసిన వారిని తిట్టడంతో పాటు మంచి చేసిన వారిని పొగుడుతుంటారు ప్రతీ శనివారం. అయితే ఈ రోజు కూడా ఇంట్లోని వాళ్లకు చాలా గట్టిగానే క్లాస్ పడింది. ముఖ్యంగా ప్రిన్స్ యావర్ పై ఎవరూ ఊహించని స్థాయిలో ఫైర్ అయ్యాడు నాగార్జున.

14వ వారం చాలా చక్కగా గేమ్ ఆడిన ప్రిన్స్ యావర్ ఫన్ టాస్క్ లో శోభా శెట్టితో గొడవ పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫన్ టాస్క్ వల్లే ఆయన ఈరోజు నాగార్జున్ చేతిలో తిట్లు పడ్డాడు. ముఖ్యంగా దత్త పుత్రికను తిట్టి తన పీకల మీదకు తెచ్చుకున్నాడు. అయితే ఈరోజు విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతోంది. అయితే నాగార్జున అంతగా ఏమని తిట్టారు, యావర్ ను ఏమేం అన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రిన్స్ యావర్ ఫొటో ను బోర్డుకు పెట్టి చేతిలో ఓ సుత్తె పట్టుకుని ఛీ, తూ అంటూ కొట్టాడు. చాలా కోపంగా ఉన్న నాగార్జున అప్పుడే ప్రిన్స్ యావర్ ను లేవమని చెప్పాడు. నాగార్జున తన ఫొటో పగులగొట్టడంతో ఏమీ అర్థం కానీ యావర్ షాకయ్యాడు. ఆ తర్వాత తాను అలా ఎందుకు చేస్తున్నాడో నాగార్జున చెప్పగా... ఆ సిట్యువేషన్ ను నాగార్జున అర్థం అయ్యేలా చెప్పబోయాడు యావర్. కానీ యావర్ నోరు తెరిచి మాట మాట్లాడినప్పుడుల్లా నాగార్జున... ఛీ, తూ..ఛీఛీ.. తూతూ అంటూ మరింత ఫైర్ అయ్యాడు. ఇక చివర్లో ఆపి... ఇలా ఇలా నిన్ను ఎవరైనా అంటే నీకెలా ఉంటుందని ప్రశ్నించాడు.

నేను మరీ అంతలా అనలేదు అంటూ యావర్ చెప్పగా... ఆ వీడియోను ప్లే చేశాడు నాగార్జున. అందులో యావర్ శోభా శెట్టి మాట్లాడుతుండగా.. ఛీ తూ అంటూ కనిపించాడు. ఛీఛీఛీఛీఈ అంటూ ఓ పదీ పదిహేను సార్లు అన్నాడు. ఇది చూసిన నాగార్జున్ వరస్ట్ బిహేవియర్ యావర్ అంటూ తెలిపాడు. మాకు నీ క్యారెక్టర్ ఇదే అనిపిస్తుందంటూ చెప్పాడు. ఇఖ చివర్లో యూ ఆర్ రాంగ్ అనగా.. ఏం చెప్పాలో తెలియని యావర్ తల కిందకు వేసుకున్నాడు. అయితే ఈ ప్రోమో చూసిన ప్రతీ ఒక్కరూ మరీ ఇంతలా తిట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. శోభాశెట్టియే కావాలని రెచ్చగొట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈరోజుటి పూర్తి వీడియో చూస్తే తప్ప ఏం జరిగిందో తెలిసేలా లేదు.


Click it and Unblock the Notifications











