Bigg Boss Telugu 7: యావర్, ప్రశాంత్‌లపై శివాజీ పక్షపాతం... ఇంతకీ నాగార్జున ఏం తేల్చాడంటే?
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ప్రారంభం అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ కూడా రసవత్తరంగా సాగుతోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుంటున్న ఈ షో... దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివాజీ పవర్ అస్త్ర వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రోమో దానిపై చర్చించారు. ఆ వివరాల్లోకి వెళితే....
వీకెండ్ వచ్చేసింది. ఇక అంతా ఎదురుచూసేది బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ కోసమే. సండే ఫన్ డే అంటూ నాగార్జున ఎంటర్ అవుతాడు. ఇక కంటెస్టెంట్స్ కూడా టిప్ టాప్ రెడీ అయి... సోఫాలో కూర్చొంటారు. ఇక వారితో నాగార్జున ఆడిస్తాడు.. పాడిస్తాడు.. మొత్తానికి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి వెళ్తాడు. ఇక వారం మొత్తం ఒకఎత్తు అయితే... వీకెండ్ ఎపిసోడ్స్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. అలా ఈ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో అయితే ఒకటి రిలీజ్ అయింది.

ఇక సండే వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తిగా ఉంటుందని ఈ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటి నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ పవర్ అస్త్రను వెనక్కి తీసుకున్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో శివాజీ తన పవర్ అస్త్రను ఎందుకు వెనక్కి తీసుకున్నారు అని అడుగుతాడు. ఇక దానిపై హౌజ్ లో చర్చ మొదలు అవుతుంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో... శివన్న చెప్పు... అని నాగార్జున అంటాడు. ఇక దానికి శివాజీ నేను ఎందుకు హౌజ్ మేట్ కి అనర్హుడిని అంటూ ప్రశ్నిస్తాడు. మీరు పక్షపాతిగా ఉన్నారు వాళ్లు భావించారు అని వారు అన్నారు అంటూ నాగార్జున చెప్తాడు. ఇక నేను అలా ఉన్నాను అనేదానికి సాక్ష్యం ఒక్కటి కూడా లేదు బాబు గారు అంటూ శివాజీ చెప్తాడు.
దానికి నాగార్జున.. శోభను అడుగుతాడు. శివాజీ పార్షియల్ యేనా అని.. దానికి శోభా మాట్లాడుతూ.. అమర్, ప్రియాంక పేరు వస్తే చాలు.. ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో.. అది చెప్పనివ్వడం లేదు సార్ అంటూ చెప్తుంది. దానికి అమర్ ను సపోర్ట్ చేయడానికి నీకు ఒక్క రీజన్ చెప్పు అని అడగ్గా... నేను అమర్ ను సపోర్ట్ చేయడం లేదని శోభా చెప్తుంది.

నాగార్జున ఇప్పుడే చెప్పావ్ కదా అంటాడు. ఇక ఎవరి విషయంలో శివాజీ పార్షియల్ గా ఉన్నాడు అని నాగార్జున అడగ్గా... యావర్ అండ్ ప్రశాంత్ విషయంలో ఉన్నాడు అంటుంది. యావర్ నామినేట్ అయ్యాడుగా మరి పార్షియాలిటీ ఏముంది అంటూ నాగార్జున షాక్ ఇస్తాడు. నువ్వు, సందీప్ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు.. దానికి శివాజీ కన్సిడ్ అవుతున్నాడు.. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు.. అంటూ నాగార్జున సీరియల్ బ్యాచ్ ను ఉతికి ఆరేశాడు.


Click it and Unblock the Notifications











