Bigg Boss Telugu 7: రాజమాతలను ఏకిపారేసిన నాగార్జున, ప్రియాంక, శోభాలకు గట్టిగా పడిందిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అద్భుతంగా సాగుతోంది. ఎవరూ అనుకోని విధమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. పదో వారంలో జరిగిన వింతలూ, విశేషాలు అయితే మరింత అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ అయితే అదుర్స్ అనే చెప్పొచ్చు. శివాజి కొడుకును ఇంట్లోకి రప్పించడంతో మొదలు పెట్టి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి రావడం వరకూ ఫుల్లుగా ఎమోషన్స్ పండాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ మరో లెవల్ అనే చెప్పొచ్చు. కెప్టెన్ అయ్యేందుతు గౌతమ్ కృష్ణ, శివాజిల మధ్య వార్ నడవగా.. ఆ తర్వాత ప్రిన్స్ యావర్, అమర్ దీప్ ల మధ్య కూడా అదే స్థాయిలో గొడవ జరిగింది.

అయితే ఈరోజుటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ టీం వదిలింది. అందులో నాగార్జున కామెడీతో పాటు కంటెస్టెంట్లపై కోపాన్ని చూపించారు. ముఖ్యంగా నామినేషన్లలో భాగంగా జరిగిన అనేక విషయాలను కంటెస్టెంట్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే రాజ మాతలుగా వ్యవహరించిన శోభా శెట్టి, ప్రియాంక జైన్, అశ్విని శ్రీ, రతికా రోజ్ లకు చాలా గట్టిగా క్లాస్ పీకారు. అందులో శోభా శెట్టి, ప్రియాంక జైన్ లపై అయితే మరింత ఫైర్ అయ్యారు. మీరు ఇద్దరూ రతికా, అశ్వినిలను డిసీషన్ ను తీసుకోలేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

Nagarjuna Fires on Shobha Shetty and Priyanka Jain in Bigg Boss Telugu 7

అలాగే అమర్ దీప్ ను మూడు సారు నామినేట్ చేసినప్పటికీ... అసలు ఎందుకు నామినేట్ చేయలేదని అడిగారు. ఇదే విషయమైన కంటెస్టెంట్లు అందరితో సెపరేట్ గా మాట్లాడారు. శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఫేవరిజం చూపించినట్లు అనిపించిందా అని అడిగారు. ఈక్రమంలోనే భెలె.. అశ్విని, రతికాలను వారిద్దరూ మాట్లాడనీయనట్టు, వీరి డెసీషన్ ను వారు కన్సిడర్ చేయనట్లు అనిపించిందని చెప్పాడు. అలాగే గౌతమ్ కృష్ణ కూడా అమర్ దీప్ ను మూడు సార్లు నామినేట్ చేసినప్పటికీ.. ఎందుకు నామినేషన్లలోకి తీసుకురాలేరని అనిపించినట్లు వివరించాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన అమర్ దీప్ ను నాగార్జున నేరుగా ఓ ప్రశ్న అడిగారు. రాజమాతలు నిన్ను యునానిమస్ గా ఎందుకు ఎందుకు సేవ్ చేశారని అడిగారు. అందుకు అమర్ దీప్ ఎప్పటిలాగే బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. ఇక ఆ తర్వాత నాగార్జున శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు చాలా పార్షియల్ గా బయాస్డ్ గా వ్యవహరించినట్లు తనకు అనిపించిందని వెల్లడించారు. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అయింది.

అయితే ఈ ప్రోమోలోనే ఎవరికి కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నారని.. హౌస్ మేట్స్ అందరినీ విడి విడిగా అడిగారు. ఇలా చాలా మందిరి శివాజి పేరు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే 11వ వారం కెప్టెన్ గా శివాజిని కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం. ఈరోజు పూర్తి ఎపిసోడ్ చూస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X