Bigg Boss Telugu 7: శోభాశెట్టి నిజస్వరూపం బయటపెట్టిన నాగార్జున.. ఆ వీడియోతో ముద్దుబిడ్డకు చెమటలు పట్టించిన
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో చూస్తుండగానే ఫైనల్స్ కు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లోనే షో ముగుస్తుంది. ఈవారం ఒకరో, ఇద్దరో ఎలిమినేట్ అయితే టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఈ వారం ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ అయితే టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నట్లే. అయితే ఏ సీజన్ లోనూ లేనెట్లుగా ఈ సీజన్ సాగుతుంది. ముఖ్యంగా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్ లో బిగ్ బాస్ తనకు నచ్చిన వాళ్లను కాపాడుకుంటున్నరు. వాళ్లను టాప్ 5 వరకు తీసుకు వచ్చేందుకు చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వాళ్లపై విపరీతమైన ప్రేమ కనబరుస్తున్నారు.
అయితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ ముద్దుబిడ్డలు, దత్త పుత్రికలే ఓటింగ్ లో చివర ఉన్నారు. ముఖ్యంగా శోభాశెట్టి, ప్రియాంక జైన్ లలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. దీంతో షోను మరింత రసవత్తరంగా తిలకిస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ముఖ్యంగా శోభాశెట్టి హేటర్స్, స్పై బ్యాచ్ అంటే శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ల ఫ్యాన్స్ అయితే మరింత ఖుషీ అవుతున్నారు. ఈ వారం కచ్చితంగా ఆమే ఎలిమినేట్ అవుతుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎవరు ఎలిమినేట్ అయినా.. శోభా హేటర్స్ కు మాత్రం ఈ వారం కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు నాగార్జున.

ఎవరూ ఉహించని విధంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ, దత్తపుత్రిక అయిన శోభాశెట్టికి గట్టిగా క్లాస్ పీకాడు. శనివారం వచ్చే ఎపిసోడ్ లో భాగంగా ఆయన ఇలా ఫైర్ అయినట్లు ఈరోజు విడుదల అయిన ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా ఫన్ టాస్క్ లో శోభాశెట్టి చేసిన అరాచకాలను ఆమెకే వీడియోల రూపంలో చూపిస్తూ నాగార్జున ఆమెను మాట్లాడనివ్వలేదు. నోరు విప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గట్టిగా వేసుకున్నాడు. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మనం ఇప్పుడు తెలుసకుందాం.
ప్రోమో స్టార్ అవ్వడం స్టార్ట్ అవ్వడమే.. నాగార్జున శోభాశెట్టి ఫొటో రెడ్ బోర్డుపై పెట్టి సుత్తెతో పగుల గొట్టాడు. ఆపై ఓ వీడియో చూపించాడు. అందులో శోభా... ఆవారం ఏ టు జెడ్ తీయకపోతే నేను శోభాశెట్టినే కాదంటూ ప్రియాంక జైన్ తో చెప్పింది. ఇది చూపించిన నాగార్జున.. నువ్వు శోభాశెట్టివే చెప్పు ఇప్పుడు కౌంటర్ వేశాడు. అందుకు ఆమె ప్రతీసారి శివాజి సార్ ఫేవరిజం, ఫేవరిజం అంటూ చెబుతున్నాడు. ఆయన కావాలనే మమ్మల్ని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారంటూ ఫైర్ చెప్పుకొచ్చింది. అదంతా విన్న నాగార్జున.. మరి ఫన్ టాస్క్ లో నిన్ను సంచాలక్ గా పెడితే... ప్రియాంకకు ఎందుకు సపోర్ట్ చేశావంటూ ప్రశ్నించాడు. ఆమెకు సపోర్ట్ చేశావంటే ఫేవరిజం చూపించినట్లే కదా.. అప్పుడు ఎవరైనా అలాగే అంటారు కదా నాగార్జున మరింత గట్టిగా ఫైర్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత ఈ వారం అంతా నా మైండ్ డిస్ట్రబ్డ్ గా ఉందని శోభా చెప్పగా.. నువ్వు డిస్ట్రబ్ అవుతూ, నీ ఆటను డిస్ట్రబ్ చేసుకుంటూ... మిగిలిన వాళ్లందరినీ డిస్ట్రబ్ చేశావంటూ నాగార్జున్ ఫైర్ అయ్యాడు. అందుకు శోభాశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. అందర్నీ రెచ్చగొడుతున్నావు అంటూ నాగ్ అన్నాడు. అందుకు శోభా ఏడుస్తూనే.. నేను ఎవరి ఆటను డిస్ట్రబ్ చేయాలని అలా చేయలేదు అంటూ తెలిపింది. బాల్ టాస్క్ లో యావర్ తో నువ్వు చేసిందేంటి... మొదలు పెట్టిందే నువ్వు అంటూ తెలిపాడు.
యావర్ నన్ను గట్టిగా కొట్టాడంటూ చెప్పావు అనగానే... నేను గట్టిగా అనే వర్డ్ యే వాడలేదని చెప్పింది శోభా. వెంటనే నాగార్జున.. ఆ వీడియోను చూపించగా.. అందులో శోభా యావర్ యే నన్ను గట్టిగా కొట్టాడు అని అంది. ఇక దీనికి ఏం అనాలో తెలియక ఆమె తల కిందకు దించుకుంది. ఈరోజుటి ఎపిసోడ్ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూసేయండి.


Click it and Unblock the Notifications











