Bigg Boss Telugu 7: స్టేజీమీదే నాగార్జున పచ్చి బూతులు.. ఎర్రిపోహా, పిచ్చిపోహా అంటూ శివాజిపై ఫైర్!

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బుల్లితెరపై ప్రభంజనం సృష్టిస్తున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన రియాల్టీ షో పేరొందిన ఈ షో.. అనేక భాషల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో అయితే ఏడు సీజన్లుగా ఈ షో వస్తోంది. ప్రస్తుతం ఏడో సీజన్ తో అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకొని పదకొండో వారం చివరకు వచ్చింది. రోజురోజుకూ మరింత ఆసక్తిగా మలుస్తూ బిగ్ బాస్ టీం నిర్వాహకులు.. ఫుల్లుగా ఎమోషన్స్ పండిస్తున్నారు.

అయితే షో ప్రారంభం అయిన మొదటి వారంలోనే ఇంట్లో అడుగు పెట్టిన శివాజి గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనసుల్లో చోటు దక్కించుకున్న ఈయనే.. బిగ్ బాస్ విన్నర్ అని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈయన ఆడే గేమ్ కంటే కూడా.. రైతుబిడ్డ పల్లవి ప్రాశాంత్ కు సపోర్ట్ గా నిలబడడంతోనే ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మంచి వాడు, ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే రియాక్ట్ అవుతాడనే పేరు వచ్చింది. అందుకే నాగార్జున కూడా బిగ్ బాస్ ఇంటి పెద్దగా శివాజికి బాధ్యతలు అప్పగించారు.

 Nagarjuna Fires on Sivaji About His Using Bad Words in Bigg Boss Telugu 7 House

ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా, తప్పుగా మాట్లాడిన చెప్పమని పలుమార్లు చెప్పారు. ఇదంతా విన్న హౌస్ మేట్స్ కూడా శసివన్న, శివన్నా అంటూ ఆయన చెప్పినట్లుగానే నడుచుకున్నారు. అలాగే శివాజి కూడా అందరితో బాగుంటూ చక్కగా గేమ్ ఆడారు. ముఖ్యంగా తాను ఏ చేస్తే బయటకు వెళ్తుంది, ఏం మాట్లాడితే బయటకు వెళ్తుందో ఫుల్ క్లారిటీగా ఆయనకు తెలుసు. పదోవారంలో భాగంగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పటి నుంచి శివాజిలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ముఖ్యంగా అందరూ అతను టాప్ 5లో ఉంటాడని చెప్పగా.. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం కల్గింది.

 Nagarjuna Fires on Sivaji About His Using Bad Words in Bigg Boss Telugu 7 House

అంతేకాకుండా ఈ వారం హౌస్ మేట్స్ అంతా కలిసి అతడిని విన్నర్ గా చెబుతూ.. టాప్ 1లో ఉంచే సరికి గర్వం తలకు ఎక్కినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ వారం టాస్క్ లలో భాగంగా శివాజి చాలా అగ్రెసివ్ అయ్యారు. నోటికి ఎంత వస్తే అంత మట్లాడారు. ముఖ్యంగా అమర్ దీప్ ను పిచ్చిపోహా, ఎర్రిపోహా అంటూ వ్యాఖ్యానించడంతో.. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈక్రమంలోనే వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున వీటిపై స్పందించాడు. ముఖ్యంగా పెద్ద మనిషిగా కొనసాగుతున్న శివాజి బిగ్ బాస్ ఇంట్లో బూతులు మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Nagarjuna Fires on Sivaji About His Using Bad Words in Bigg Boss Telugu 7 House

ఈరోజు వచ్చి ప్రమో ప్రకారం.. ముందుగా నాగార్జున.. శివాజిని లేపారు. నీతో నాక్కొంచెం సమస్యలు ఉన్నాయని చెప్పగానే.. బూతులా అంటూ శివాజి అడిగాడు. అవును అంటూ ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది, ఈ విషయంలో నీ సహనం ఏమైంది, ఈ విషయంలో నీ సమర్ధత ఏమైందంటూ ప్రశ్నించాడు. ఎర్రి పోహా, పిచ్చి పోహా... ఇలాంటి మాటలు ఇంట్లో అవసరమా అంటూ శివాజిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున తొలిసారిగా శివాజితో ఇలా మాట్లాడడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. ఈరోజుటి ఎపిసోడ్ లో అసలు విషయం మొత్తం తెలుసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X