Bigg Boss Telugu 7: బెల్ట్ పట్టుకుని బెండు తీసిన నాగార్జున... ఆ కంటెస్టెంట్ డైరెక్ట్‌గా ఇంటికే!

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇక అంతా ఎదురు చూసేది వీకెండ్ ఎపిసోడ్ గురించి. ఎందుకంటే.. సండే ఫన్ డే అంటూ నాగార్జున ఎంట్రీ.. కంటెస్టెంట్స్ కూడా టిప్ టాప్ రెడీ అయి ఎంటర్ టైన్ ఇచ్చేందుకు సిద్ధం అవుతారు. అయితే తాజాగా వీకెంట్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారని చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్టు ఇంటికి పంపించాలని నిర్ణయించారు. మరి ఆ ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

బిగ్ బాస్ ప్రేక్షకులు అంతా వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తు ఉంటారు. ఇప్పటికే మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్ కు సిద్ధం అయింది. హౌజ్ లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా.. ఇప్పటికే ముగ్గురు ( కిరణ్, షకీలా, దామిని) ఎలిమినేట్ అయ్యి... కేవలం 11 మంది మిగిలారు. అయితే అందులో నాలుగురు హౌజ్ మేట్స్ గా ఎంపిక అయ్యారు. ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి.. ఇటీవల పల్లవి ప్రశాంత్ వీరంతా పవర్ అస్త్ర గెలుచుకుని హౌజ్ మేట్స్ గా సెటిల్ అయ్యారు.

Nagarjuna Fires

ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో చూస్తే.. బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా.. ఇక ఆ ప్రోమోలో నాగార్జున ఎంట్రీ చూస్తే.. ఎవరికైనా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక నాగ్ ఓ బెల్టు పట్టుకుని ఆయన వస్తారు. ఇక హౌజ్ లోని సభ్యులంతా ఆయన్ని చూసి షాక్ అవుతారు. ఇక హౌజ్ లోని సంచాలక్ సందీప్ పై నాగ్ ఫైర్ అవుతారు. నీకు కళ్లు కనిపిస్తాయా.. లేక గుడ్డొడివా అంటూ ఫైర్ అవుతాడు నాగార్జున.

ఇక అటు శివాజీ పైన కూడా నాగ్ ఫుల్ ఫైర్ అవుతాడు. మీకూ కనిపించడ లేదా అని అడుగుతాడు. అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్కులో గౌతమ్ మెడకు టేస్టీ తేజా బెల్టు వేసి లాగుతాడు. చాలా ఘోరంగా గౌతమ్ మెడకు బెల్టు వేసి టేస్టీ తేజా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాడు. అక్కడ ఉన్న సంచాలక్ కానీ, శివాజీ కానీ ఎవరూ మాట్లాడరు. ఇక టేస్టీ తేజ టర్మ్ వచ్చేసరికి బెల్టు వేస్తుంటే.. శివాజీ మెడకు తగులుతుందని అంటారు. శివాజీ ఇలా ప్రవర్తించడంపై నెటిజన్స్ ఫైర్ కూడా అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ గా మారాయి.

 Sivaji, Sanjeep And Testy Teja

అయితే ఈ విషయం పైనే నాగార్జున హౌజ్ లో పంచాయితీ పెడుతాడు. ఈ వారం బెల్టు తీసుకు వచ్చి.. అందరి బెండు తీస్తాడని ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. అందులో భాగంగానే తేజాపై సైతం నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఇంట్లోని వారందరికీ వీడియోలు వేసి మరీ క్లాస్ పీకుతాడు. అటు ఆట సందీప్, శివాజీ, టేస్టీ తేజలను ఓ రేంజులో నాగార్జున ఆటడేసుకుంటాడు.

 Bigg Boss Telugu 7 Day 27

ఇక శివాజీ కావాలనీ చేయలేదు అంటూ సర్ధి చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు సందీప్ సైతం సారీ అంటూ తప్పించుకుంటాడు. దీంతో సారీ ఏంటయ్యా సారీ.. సంచాలక్‌ గా మీరు ఫెయిల్ అయ్యారంటూ ఫుల్ ఫైర్ అవుతాడు నాగార్జున. ఇక టేస్టీ తేజాకి ఏం శఇక్ష వేయాలని హౌజ్ లోని మెంబర్స్ ను అడిగితే... జైలుకి పంపుదాం అని శుభ శ్రీ చెప్తుంది. నువ్వేం అంటావ్ సందీప్.. అని నాగార్జున అడగడంతో.. డైరెక్ట్‌గా పంపేద్దాం సార్ అని చెప్తాడు. ఇంతటితో ప్రోమో ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X