Bigg Boss Telugu 7: శోభాశెట్టికి గట్టిగా తలంటిన నాగార్జున.. భోలే పేరు చెప్పి మోనితకు సూపర్ పంచ్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ కు అంతా రెడీ అయిపోయింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా నాగార్జున ముందు మేకప్ వేసుకుని కూర్చుకున్నారు. అయితే ఈ ప్రోమోలో నాగార్జున శోభాశెట్టికి బాగానే క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ప్రవర్తనపై నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. అసలు ఏం జరిగింది.. ఎందుకు శోభా శెట్టిని నాగార్జున గట్టిగా వాయించాడు అనేది ఈ స్టోరీలో చూద్దాం.
గత సీజన్స్ కంటే ఈ సీజన్ నిజంగానే ఉల్టా పుల్టాగా సాగుతోందనడంలో సందేహం లేదు. ఇక ఈ సీజన్ లో ప్రేక్షకుల ఊహకు అందకుండా బిగ్ బాస్ లాస్ట్ మినిట్లో ట్విస్టులు, షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. 8 వారాలు పూర్తి చేసుకోబోతుంది. వంద రోజుల పాటు ఈ షో సాగనుండగా.. తాజాగా 55వ రోజు ప్రోమో విడుదల అయింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కావడంతో అంతా మేకప్లు వేసుకుని కంటెస్టెంట్స్ కెమెరా ముందుకు వచ్చారు.

తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తే.. శోభా శెట్టిపై నాగార్జున ఫుల్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. వారం మొత్తం చూసిన ప్రేక్షకులు.. ఆమెను ఎందుకు తిట్టారో ఇట్టే అర్ధం అవుతుంది. ఈ వారంలో శోభాశెట్టి చేసిన రచ్చ.. మామూలు రచ్చ కాదు.. అందరితో గొడవలు.. హద్దు మీరి ప్రవర్తన.. చూసే వారికే చిరాకు పుట్టించేలా అనిపించింది. ఇక కార్తిక దీపం మౌనిత క్యారెక్టర్ కంటే.. శోభాశెట్టి క్యారెక్టర్ వెరీ డెంజరస్ అంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్స్.
ఇక ప్రోమోలో నాగార్జున... ఓ స్టిక్ పట్టుకుని వచ్చారు. దాన్ని బ్రేక్ చేసి.. ఫేస్ ను సీరియస్ గా పెట్టారు. ఇక శోభా అని పిలిచిన నాగార్జున... కెప్టెన్సీ నుంచి తీసేశాడు సార్.. అది నాకు రీజన్ కరెక్ట్‌గా అనిపించలేదు.. అంటూ శోభా శెట్టి అమాయకంగా చెప్పుకువచ్చింది. ఇక నాగార్జున.. లాస్ట్ వీక్ భోలే ఎర్రగడ్డ అనే పదం అంటే గింజుకున్నావ్.. మరి నువ్వు పిచ్చోడనడం కరెక్టా అంటూ నాగార్జున క్వశ్చన్ వేశాడు. దీనికి శోభా శెట్టి కామ్ గా ఉండిపోయింది. ఇక శోభా శెట్టితో నాగార్జున... నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదా అంటూ ఫైర్ అయ్యారు.

ఇక నెక్ట్స్ యావర్ పైన కూడా నాగార్జున ఫైర్ అయినట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది. నీకు ఒక వీడియో చూపిస్తాను చూడు.. దాని తర్వాత మాట్లాడుకుందామని నాగార్జున అన్నాడు. ఇక వీడియో ప్లే చేశారు. ఇందులో శోభా మీదకి యావర్ సీరియస్‌గా వెళ్లడం.. ఇద్దరూ తిట్టుకోవడం.. తర్వాత యావర్ మిర్చి దండని కోపంగా నేలకేసి కొట్టడం కనిపించాయి.
ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ... కంప్లీట్ రూల్స్ ఉన్నాయి.. బిగ్‌బాస్ ప్రాపర్టీని పాడు చేయకూడదని.. మళ్లీ నువ్వు నీ పాత పద్ధతికి, ఒరిజినల్ బిహేవియర్‌కి వెళ్లిపోయావ్ అని ఫైర్ అయ్యాడు. నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూస్తే నేను అయినా ఆడియన్స్ అయినా సరే పిచ్చోడనే అంటారు అంటూ నాగార్జున యావర్ పై ఫుల్ ఫైర్ అయ్యారు. ఇంతటితో ప్రోమో ముగిసింది. ఇక ఈ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











