Bigg Boss Telugu 7: ఎలిమినేషన్ల సీక్రెట్ లీక్.. వాళ్లు వెళ్లడానికి కారణం ఒక్కడే.. నోరు జారిన నాగ్

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం కొన్నే ఉంటున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. మన వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా దీనికి మంచి ఆదరణ లభించింది. అందుకే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ కూడా అదే రెస్పాన్స్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లోని ఎలిమినేషన్లపై నాగార్జున నోరు జారాడు. అసలేమైందో మీరే చూసేయండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇందులో ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. ఇలా ఇప్పటికే ఎనిమిది వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

Nagarjuna Funny Comments on Tasty Teja about Eliminations In Bigg Boss Telugu 7 Show

బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. అలాగే, రతికా రోజ్‌ను కూడా రీఎంట్రీ కంటెస్టెంట్‌గా తీసుకు వచ్చారు. ఇలా మొత్తం ఇందులోకి 20 మంది కంటెస్టెంట్లు అయ్యారు. ఇందులో 8 వారాలకు గానూ ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు, ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు.

సాధారణంగా బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్లు అనేవి ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. ఊహించని విధంగా ఏడో సీజన్‌లో మొదటి ఏడు వారాల్లోనూ లేడీ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. ఇలా ఏ భాషలో కూడా వరుసగా ఇంత ఎక్కువ సంఖ్యలో ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవలేదు. 8వ వారంలో సందీప్ మాస్టర్ వెళ్లడంతో ఈ చెత్త రికార్డుకు బ్రేక్ పడిందని చెప్పాలి.

Nagarjuna Funny Comments on Tasty Teja about Eliminations In Bigg Boss Telugu 7 Show

ఇక, ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఎలిమినేషన్ల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆయన స్పందిస్తూ.. 'సందీప్ నిన్ను టేస్టీ తేజనే నామినేట్ చేశాడు కదా' అని అన్నాడు. దీంతో తేజ తన వల్లే సందీప్ ఎలిమినేట్ అయ్యాడని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు.

ఆ తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జున 'తేజ నువ్వు మామూలోడివి కాదుగా. ఈ వారం సందీప్‌ను నామినేట్ చేశావు. అతడు ఎలిమినేట్ అయ్యాడు. లాస్ట్ వీక్ పూజా మూర్తిని చేశావు. ఆమె వెళ్లిపోయింది. అంతకు ముందు నయనీ పావనిని చేశావు. ఆమె కూడా ఎలిమినేట్ అయిపోయింది. వీళ్లు ముగ్గురు ఎలిమినేషన్లకు నువ్వే కారణం' అంటూ తేజపై కామెంట్స్ చేశాడు.

నాగార్జున మాటలకు టేస్టీ తేజ బాగా ఫీల్ అయిపోయాడు. అది గమనించిన ఆయన 'నేను సరదాగా అన్నాలే తేజ. ఎలిమినేషన్స్ అనేవి ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. నీ వల్ల కాదులే. నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు' అంటూ కూల్ చేశాడు. మొత్తానికి టేస్టీ తేజ రీజన్ లేని నామినేషన్ల వల్ల ముగ్గురు బలి అయిపోయారని కొందరు చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X