Bigg Boss Telugu 7: నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. రతికా ముంచేసింది అంటూ.. టాప్ 5 కంటెస్టెంట్ బలి

సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్.. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో సాగే షోనే బిగ్ బాస్. తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణు అందుకున్న ఇది.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇలా ఒకటి కాదు రెండు చాలా సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగిందో మీరే చూడండి మరి!

సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, గత సీజన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో ఊహించని ఎన్నో సంఘటనలు చూపిస్తూ షోను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడుపుతున్నారు.

Nagarjuna Funny Satires on Rathika about Prince In Bigg Boss Telugu 7 Show

బిగ్ బాస్ షోలో హోస్ట్ అక్కినేని నాగార్జున ఆదివారం ఇంటి సభ్యులతో కలిసి సందడి చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో ఆయన కంటెస్టెంట్లతో కలిసి సరదాగా కనిపించాడు. ఎప్పటిలాగే ఇందులో కూడా ఆటపాటలతో సందడి చేశాడు. అలాగే ఒక్కొక్కరిని సేఫ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఈ ఎపిసోడ్‌లో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు.

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున 'ముంచేది ఎవరిని' అనే ఆటను కంటెస్టెంట్లతో ఆడించాడు. ఇందులో భాగంగా ఓ బోట్ బొమ్మను తెచ్చి.. అందులో కంటెస్టెంట్లు ఇద్దరి ఫొటోలను పెట్టించి.. ఈ ఇద్దరిలో ఎవరిని ముంచుతావు? ఎవరిని ఉంచుతావు? అని ప్రశ్నించాడు. ఇంట్లో ఉన్న అందరు కంటెస్టెంట్లు నాగార్జున ప్రశ్నకు సమాధానాలు చెప్పారు.

ఈ గేమ్‌లో భాగంగా ప్రిన్స్ యావర్‌ను పిలిచిన నాగార్జున.. బోట్‌లో శివాజి, రతికా రోజ్ ఫొటోలను పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత వాళ్లలో ఎవరిని ముంచుతావు అని ప్రశ్నించాడు. దీంతో అతడు రతికాను ముంచి, శివాజిని ఉంచుతానని చెప్పాడు. దీంతో ఆమె బిక్కముఖం వేసేసింది. ఆ తర్వాత రతికా రోజ్ పిలిచాడు. కానీ, ఎవరి ఫొటోలు పెట్టాలని మిగిలిన హౌస్‌మేట్లను అడిగాడు.

Nagarjuna Funny Satires on Rathika about Prince In Bigg Boss Telugu 7 Show

నాగార్జున అడగడంతో అందరూ శివాజి, యావర్ ఫొటోలు పెట్టాలని చెప్పారు. దీంతో ఆ పిక్స్‌నే ఉంచి రతికాను ప్రశ్నించాడు. ఆ వెంటనే 'రతికా నువ్వు ఆగమ్మా. ఇప్పుడు తను ఎవరిని ముంచుతుంది' అని శోభా శెట్టి, ప్రియాంక, అశ్వినీలను అడిగాడు. ఇందులో ఇద్దరేమో శివాజి ఫొటోను ముచుతుంది అని, శోభా శెట్టి మాత్రం యావర్ ఫొటో ముంచుతుంది అని చెప్పారు.

ఇక, రతికా రోజ్ మాత్రం ప్రిన్స్ యావర్ ఫొటోను ముంచేసింది. అప్పుడు 'తను నాకు మంచి ఫ్రెండ్. కానీ, నా ఫొటో ముంచడంతో ఏదో ఉందని అర్థం అయింది. ఇక, శివన్న ఎప్పుడూ బిడ్డా బిడ్డా అంటుంటాడు. అందుకే ఆయనను ఉంచి.. యావర్‌ను ముంచాను' అంది. దీంతో నాగార్జున 'రతికా రోజ్.. యావర్‌ను ముంచేసింది' అంటూ పరోక్షంగా పంచ్‌లు వేశాడు.

Nagarjuna Funny Satires on Rathika about Prince In Bigg Boss Telugu 7 Show

ముంచే టాస్క్ జరిగిన సమయంలో రతికా రోజ్.. ప్రిన్స్ యావర్‌ను ముంచేస్తుందని ఇంట్లోని వాళ్లంతా పరోక్షంగా చెప్పారు. అదే నాగార్జున కూడా అతడికి ఇండైరెక్టుగా హింట్ ఇచ్చి.. సొంతంగా ఆడమని సూచించాడు. కానీ, ప్రిన్స్ మాత్రం ఆమె వెనకాలే పడుతూ.. బ్రతిమాలుతూ కనిపించాడు. మరి రానున్న రోజుల్లో యావర్, రతికా ట్రాక్ ఎలా వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X