Bigg Boss 7 Telugu: రతికా బాయ్‌ఫ్రెండ్‌పై నాగార్జున కామెంట్.. అర్థం అయినోళ్లకు అర్థం అయినంత!
బిగ్ బాస్.. పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్న ఏకైక షో. వేరే భాషల్లోనూ ప్రసారం అవుతున్నా తెలుగులో మాత్రమే దేశంలోనే అత్యధిక రేటింగ్ లభిస్తోంది. ఇలా ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున.. రతికా రోజ్‌పై ఊహించని కామెంట్లు చేశాడు. అసలేమైందో మీరే చూసేయండి!
బిగ్ బాస్ షోలో వీకెండ్ ఎపిసోడ్లలో మాత్రమే హోస్ట్ నాగార్జున వస్తుంటాడు. అందులో శనివారం కంటెస్టెంట్లు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ క్లాస్ తీసుకుంటాడు. ఆదివారం ఎపిసోడ్ మాత్రం ఫన్నీగా సాగుతుందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే గత ఎపిసోడ్ ఆద్యంతం సందడి సందడిగా సాగింది. ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు, గెస్టుతో ఇది అదిరిపోయింది.

సాధారణంగా సండే ఎపిసోడ్‌లో ఫన్నీ టాస్కులు పెడుతుంటారు. కానీ, ఈ ఆదివారం మాత్రం కంటెస్టెంట్లను ఇరికించే విధంగా డిజైన్ చేసిన 'చిట్టి ప్రశ్నలు.. గట్టి సమాధానాలు' అనే గేమ్ పెట్టాడు. ఇందులో కంటెస్టెంట్ వీల్ తిప్పగా.. అది ఏ కలర్ దగ్గర ఆగితే.. ఆ కలర్ పేపర్‌లో రాసిన క్వశ్చన్‌ను నాగార్జున ఆ తిప్పిన వాళ్లను అడుగుతాడు. ఇందులో క్లిష్టమైన ప్రశ్నలే ఉంచారు.
'చిట్టి ప్రశ్నలు.. గట్టి సమాధానాలు' గేమ్ సాగుతున్న సమయంలో నాగార్జున తనదైన పంచ్ డైలాగులతో చాలా మంది కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రతికా రోజ్‌ను పిలిచాడు. ఆమె వీల్‌ను తిప్పగా.. రెండు కలర్ల మధ్యలో ఆగింది. దీంతో ఆమె డైలమాలో పడింది. అప్పుడు నాగార్జున 'రతికా నీకు రెండు కలర్స్ మధ్యలో కన్‌ఫ్యూజన్ ఉన్నట్లుంది' అని పంచ్ వేశాడు.
తర్వాత పక్కన ఉన్న కంటెస్టెంట్లు రెడ్ దగ్గర ఆగిందని చెప్పడంతో నాగార్జున 'ఆటలో నిన్ను కిందకు లాగుతున్నటువంటి వ్యక్తి ఎవరు' అని రతికను ప్రశ్న అడిగాడు. దీనికామె 'ఆటలో నేను క్లారిటీగానే ఉన్నాను.. నన్ను ఎవరూ లాగడం లేదు' అని చెప్పింది. దీంతో నాగార్జున మరి కిందకు ఎలా వచ్చావు అని అడగ్గా.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్ పేర్లను చెప్పింది.
వాళ్లిద్దరి పేర్లు చెప్పగానే నాగార్జున.. 'ఓహో.. రెండ్ అండ్ ఎల్లోనా' అని మరో సెటైర్ వేశాడు. అప్పుడు రతికా 'హా వీళ్లే నా రెడ్ అండ్ ఎల్లో' అంది. అంటే.. ఏ బాయ్‌ఫ్రెండ్‌ను కంటిన్యూ చేయాలో రతికకు అర్థం కావడం లేదు అన్నట్లుగా నాగార్జున పంచ్ వేసినట్లు తర్వాత అర్థం అయింది. ఇక, అప్పుడు దీనిపై కాసేపు ప్రశాంత్, రతికా మధ్య వాదన జరిగింది.
మొత్తానికి రతికా రోజ్‌ను ఉద్దేశించి హోస్టు నాగార్జున వేసిన పంచ్ అర్థం చేసుకున్నోళ్లకు అర్థం అయింది. అదే సమయంలో వాళ్లు ఆమెను ఆట నుంచి డైవర్ట్ కూడా చేస్తున్నారని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. మరి ఇకనైనా రతికా ఈ వ్యవహారాల మీద కాకుండా ఆటపై దృష్టి పెడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











