For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగార్జున.. సంతోషంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్

    |

    బిగ్‌బాస్ మూడో సీజన్, అందులోని కంటెస్టెంట్లు పాపులర్ అయినంతగా వేరే ఏ సీజన్ సభ్యులు కాకపోవడం విశేషం. షో అయిపోయిన నెల రోజులు దాటినా వారింకా వార్తల్లోనే నిలుస్తున్నారు. మూడో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ ఫేమస్ అయ్యారు. ఒకరిద్దరిపై మాత్రమే కొంత నెగెటివిటీ పెరిగింది. ఈ సీజన్ ద్వారా అలీ రెజా, రాహుల్, పునర్నవి, హిమజ, శివజ్యోతి, వితికా, వరుణ్ లాంటి వారు చాలానే లాభపడ్డారు. అంతకు ముందున్న ఫేమ్ కంటే షో తరువాత రెట్టింపు ప్రేమను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.

    స్టైలీష్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న అలీ..

    స్టైలీష్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న అలీ..

    హౌస్‌లో ఉన్నంత వరకు సిక్స్ ప్యాక్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకున్న అలీ రె జా.. టాప్ 5లో నిలిచాడు. వీకెండ్ వస్తే చాలు అందరి కంటే భిన్నంగా కనబడి మార్కులు కొట్టేసేవాడు. స్టైలింగ్‌లో, లుకింగ్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు.

    పాయింట్ అవుట్ చేసిన నాగ్..

    పాయింట్ అవుట్ చేసిన నాగ్..

    అందరిలో కెల్లా అలీ రెజా ఉండే విధాన్ని నాగార్జున్ ఎన్నో సార్లు పాయింట్ అవుట్ చేశాడు. స్టేజ్ పై నుంచే ఎన్నో సార్లు అలీ డ్రెస్సింగ్ స్టైల్, లుకింగ్‌ను మెచ్చుకున్నాడు. డ్రెస్సింగ్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదంటూ ఓ సారి ఫైర్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

    నాగ్‌ను కోరిన అలీ..

    అలా స్టైలింగ్ ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న అలీకి బ్రాండెడ్ షూస్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. తాను తెచ్చుకున్న వాటిలో అవే ఎక్కువగా ఉన్నాయని కూడా తోటి సభ్యులు ఎన్నో సార్లు ఆటపట్టించేవారు. వీకెండ్‌లో హోస్టింగ్ చేయడానికి వచ్చిన నాగ్‌ను.. అలీ ఓ కోరిక కోరాడు. నాగ్ వేసుకున్న షూస్ నచ్చాయని, ఆ బ్రాండ్ అంటే తనకు ఇష్టమని తెలిపాడు. అవి ఇవ్వండని అడిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు నాగ్ బయటకు వచ్చాక ఇస్తానని మాటివ్వగా.. ప్రస్తుతం దాన్ని నెరవేర్చుకున్నాడు.

     హ్యాపీ ఫీల్ అయిన అలీ..

    హ్యాపీ ఫీల్ అయిన అలీ..

    ‘మాటకు కట్టుబడే నిజమైన మనిషి.. ఆయనకిష్టమైన బ్రాండెడ్ షూస్‌ను బహుమతిగా ఇచ్చాడు.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను అడిగిన షూస్.. అప్పడు ఇచ్చిన మాట ప్రకారం.. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి.. లవ్యూ నాగ్ సర్.. యూ ఆర్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేశాడు.

    English summary
    Nagarjuna Gifted Branded Shoe To Ali Reza. Truly a man of his word! Nag sir gifted me a pair of his favourite brand of shoes. I'd asked him for these shoes while I was in the Bigg Boss house and here it is, as promised . Love you Nag sir. you're the best .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X