Bigg Boss Telugu 8: కంటెస్టెంట్లు అందరికీ బిగ్ షాక్.. ఈ సీజన్‌లో కెప్టెన్సీపై దిమ్మతిరిగే ట్విస్ట్

ఎవరూ ఊహించని కాన్సెప్టుతో వచ్చినా.. ఏ షోకూ దక్కనంత రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది బిగ్ బాస్. ముఖ్యంగా ఇది తెలుగులోకి ఎన్నో అనుమానాల నడుమ వచ్చి సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకుంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు సీజన్లను టాప్ రేటింగ్‌తో పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు అందరికీ హోస్ట్ నాగార్జున దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

తెలుగులో బిగ్ బాస్ షో నుంచి ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు షో నిర్వహకులు ఎనిమిదో దాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 1న ప్రీమియర్ ఎపిసోడ్ ద్వారా దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులో కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరిస్తున్నారు. అదే సమయంలో హౌస్‌లో కొత్తదనాన్ని చూపిస్తూ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.

Nagarjuna Gives Big Twist About Captaincy In Bigg Boss Telugu 8 Show

అంగరంగ వైభవంగా జరుగుతోన్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ ప్రీమియర్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇస్తున్నారు. అలా హౌస్‌లో ముందుగా యష్మీ గౌడ, నిఖిల్, అభయ్, ప్రేరణలు రెండు జంటలుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు గెస్టులుగా వచ్చిన రానా దగ్గుబాటి, నివేదా థామస్ వీళ్లకు టాస్క్ ఇవ్వగా.. నిఖిల్ టీమ్ ఇందులో విజయం సాధించింది.

మొదటి టాస్కులో ఓడిపోయిన అభయ్, ప్రేరణకు హోస్ట్ అక్కినేని నాగార్జున ఓ బ్యాడ్ న్యూస్ చెబుతానని అన్నాడు. ఇందుకోసం మూడు ఫ్రేములు ఉన్న ఓ బోర్డును చూపించి అందులో ఒక దానిని ఎంచుకోమని చెప్పాడు. అందులో 'నో కెప్టెన్సీ' అని వచ్చింది. అప్పుడు నాగ్ 'ఈ సీజన్‌లో కెప్టెన్సీ అనేది ఉండదు. అంటే ఇమ్యూనిటీ కూడా లభించదు' అని షాకిచ్చాడు.

వాస్తవానికి బిగ్ బాస్ షోలో ప్రతి వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అందులో గెలిచిన వాళ్లు ఇంటికి కెప్టెన్ అవుతారు. తద్వారా తర్వాతి వారంలో నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందుతారు. అలా ఎలిమినేషన్ తప్పించుకుంటుంటారు. అయితే, ఎనిమిదో సీజన్‌లో మాత్రం కెప్టెన్సీ ఉండదని నాగార్జున చెప్పాడు. ఇది ఈ సీజన్ కంటెస్టెంట్లకు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X