Bigg Boss 7 Telugu: బయటపడ్డ స్టార్ మా బ్యాచ్ కుట్ర.. సందీప్ మాస్టర్‌కు ఊహించని శిక్ష
సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్టాటలు.. లవ్ ట్రాకులు.. రొమాన్స్.. షాకింగ్ ఎలిమినేషన్స్.. ఇలా ఎన్నో రకాల రియల్ సీన్స్‌తో సాగుతోన్న షోనే బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో ఓ కుట్రను నాగార్జున బయటపెట్టాడు. అదే సమయంలో ఓ శిక్షను కూడా విధించాడు. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!
ఎన్నో ట్విస్టుల మధ్య మూడో వారం పవర్ అస్త్ర కోసం చివరికి ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పోటీదారులుగా నిలిచారు. వీళ్లకు శుక్రవారం ఎపిసోడ్‌లో ఓ టాస్క్ ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఎవరు వీక్ కంటెస్టెంటో మెజారిటీ సభ్యులు తేల్చేసి.. వాళ్ల బొమ్మను పగలగొట్టాలని చెప్పాడు. దీంతో శోభా శెట్టి, ప్రియాంక కలిసి ప్రిన్స్‌ను దీని నుంచి ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రిన్స్ యావర్‌ను 'పవర్ అస్త్ర' టాస్క్ నుంచి తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఈ టాస్కులో సంచాలకుడు సందీప్ మాస్టర్ కూడా ఫెయిల్ అయ్యాడని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున దీని ప్రస్థావన తీసుకు వచ్చాడు. అంతేకాదు, సందీప్ మాస్టర్‌పై ఓ రేంజ్‌లో సీరియస్ అవుతూ పరువు తీసేశాడు.
తర్వాత సందీప్‌పై నాగార్జున 'బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం.. ప్రిన్స్, శోభా, ప్రియాంకలలో వీక్ కంటెస్టెంట్‌ను నువ్వు ఎలిమినేట్ చేయాలి? కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశావు ఎందుకు? సంచాలకుడిగా ఉండి ప్రియాంకకు ఎందుకు సలహాలు ఇచ్చావు? ఆటలో అంపైర్ కన్‌ఫ్యూజ్ అవుతారా? నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు.
సందీప్‌ను ఒక రౌండ్ క్లాస్ పీకిన తర్వాత ప్రియాంక, శోభలను కూడా నాగార్జున ప్రశ్నించాడు. అనంతరం సంచాలకుడిగా పెద్ద పొరపాట్లు చేసిన సందీప్‌పై చర్చలు తీసుకుంటానని చెప్పాడు. ఇందుకోసం ప్రియాంక, శోభకు 'సందీప్‌ను రెండు రోజులు జైల్లో పెడదామా? బ్యాటరీ పవర్ తగ్గిద్దామా' అంటూ ప్రశ్నించాడు. వీళ్లు చర్చించుకుని జైలు శిక్షే బెటర్ అని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత నాగార్జున 'ఇక్కడ కూడా మీరు సందీప్‌కు ఫేవర్ చేయాలనే చూస్తున్నారు. అసలు ఆయన పట్ల మీరు ఎలా వ్యవహరిస్తున్నారో ప్రేక్షకులకు చూపించాలనే మిమ్మల్ని అడిగాడు. అతడికి అసలు శిక్ష నేనే విధిస్తాను' అంటూ సందీప్ బ్యాటరీని గ్రీన్ నుంచి ఎల్లోకు తగ్గించాడు. ఇలా నాగార్జున స్టార్ మా బ్యాచ్ అంటే శోభ, ప్రియాంక కుట్రను బయటపెట్టి గాలి తీసేశాడు.
మొత్తానికి శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సందీప్ మాస్టర్, ప్రియాంక జైన్, శోభా శెట్టి కలిసి ఆడుతున్నారన్న పాయింట్‌ను హైలైట్ చేశాడు. అదే సమయంలో అమర్‌దీప్ చౌదరిని కూడా ఏకిపారేశాడు. దీంతో చాలా రోజుల తర్వాత నాగార్జున బెస్ట్ హోస్టింగ్ చేశాడని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ ఎపిసోడ్ వల్ల ఈ బ్యాచ్‌పై వ్యతిరేకత కూడా పెరిగిపోయిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











