Bigg Boss Telugu 8: ప్రైజ్ మనీపై బిగ్ బాస్ మరో సంచలన నిర్ణయం.. ‘పే డే’తో నాగార్జున సర్‌ప్రైజ్
తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. అందులో కొన్ని మాత్రమే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ షో ఒకటి. అంతలా ఇది ఏడేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని నడుపుతున్నారు. ఇక, ఈ సీజన్‌లో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ వివరాలు లీక్ అయ్యాయి. మరి ఫస్ట్ వీక్‌లో షో నుంచి బయటకు వెళ్లిపోయింది ఎవరో చూద్దాం పదండి!
బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ హిట్ అవడంతో ఎనిమిదో దాన్ని కొత్త కాన్సెప్టును తీసుకు వచ్చారు. ఇందులో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ఊహించని అంశాలను చూపిస్తున్నారు. అదే సమయంలో గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త టాస్కులు కూడా ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఫలితంగా రెస్పాన్స్ కూడా బాగా లభిస్తోంది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ గతంలో వచ్చిన వాటి కంటే భిన్నంగా ఉంటుందని ప్రోమోల్లో చూపించారు. అందుకు అనుగుణంగానే ఇందులో అన్నీ వైవిధ్యాలను చూపిస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌నే చాలా కొత్తగా చూపించారు. అలాగే, మొదటి నుంచే ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, షాక్‌లు చూపిస్తున్నారు. ఫలితంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు.
ఎనిమిదో సీజన్‌లో ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే హోస్ట్ నాగార్జున పలు ట్విస్టులు ఇచ్చాడు. ముఖ్యంగా 'ఈ సీజన్‌లో కెప్టెన్సీ అనేది ఉండదు. అంటే ఇమ్యూనిటీ కూడా లభించదు' అని ఫస్ట్ షాకిచ్చాడు. తర్వాత రేషన్ కూడా సంపాదించుకోవాలని చెప్పాడు. వీటిని పక్కన పెడితే మరీ ముఖ్యంగా ఈ సీజన్ ప్రైజ్ మనీ జీరో అని చెప్పి ఎవరూ ఊహించని ట్విస్ట్‌ను ఇచ్చాడు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో ప్రైజ్ మనీని కూడా కంటెస్టెంట్లు సంపాదించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అందుకు అనుగుణంగానే తాజాగా విడుదలైన ఆదివారం ఎపిసోడ్ ప్రోమోలో సరికొత్త విషయాన్ని నాగార్జున వెల్లడించాడు. 'ఆదివారం అంటే ఫన్ డే కాదు పే డే. అంటే ఇక నుంచి మీరు ప్రతి వారం ఆడే ఆటను బట్టి మీ ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుంది' అంటూ చెప్పి సర్‌ప్రైజ్ చేశాడు. ఇలా షో ముగిసే వరకూ ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో విజేతకు అంత అందజేస్తారన్న మాట. ఇది కంటెస్టెంట్లకు బూస్ట్ ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Click it and Unblock the Notifications











