Bigg Boss Telugu 7: శోభా శెట్టి కోరికను తీర్చిన నాగార్జున.. మరి అమర్ దీప్ సంగతి ఏంటో?
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో మరో 6 రోజుల్లో ముగియనుంది. ఇక ఈ సీజన్ గత సీజన్స్ కంటే పర్వాలేదనిపిస్తుంది. ఇక చివరి ఘట్టానికి చేరుకున్న ఈ షో.. మరికొద్ది రోజుల్లో విజేత ఎవరు అనేది స్పష్టత రానుంది. ఇక ఈ సీజన్ లో హోస్టుగా చేస్తున్న నాగార్జున.. ఈ సీజన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ సీజన్ లో ఒక విషయంలో శోభాశెట్టి కోరికను తీర్చిన.. మరి అమర్ దీప్ పరిస్థితి ఏంటి అని అమర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం
బిగ్ బాస్ తెలుగు 7 మరో కొద్ది రోజుల్లో ముగియనుంది. ఇక గ్రాండ్ ఫినాలేకి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఈ సీజన్ కు నాగార్జున హోస్టుగా బాగానే చేస్తున్నాడు. ఇక నాగ్ హోస్టింగ్ కోసం షో చూసేవాళ్లు చాలానే ఉంటారు. ఇక నాగ్ వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏ షర్ట్ వేసినా.. ఇప్పుడు నెట్టింట ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

తాజాగా ఆదివారం అలాంటి ఓ స్వెట్ టీ-షర్ట్ వేసుకుని రాగా.. అది అమర్ దీప్ అడిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా పసుపు రంగు చలికోటు లాంటిది వేసుకున్నాడు నాగార్జున. చాలా వదులుగా ఉన్న ఈ టీ-షర్ట్ చూడటానికి డిఫరెంట్‌గా కనిపించింది. అమర్ దీప్ కూడా.. నాగార్జునను నాకో కోరిక ఉంది సార్ అంటూ టీ షర్ట్ కావాలని అడిగాడు. దీంతో కూర్చో అంటూ నాగార్జున ఆన్సర్ చేశాడు. ఇక ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.

అమర్ దీప్ అడిగిన ఆ టీ షర్ట్ ధఱ రూ.2,11,190 అని తెలుస్తోంది. buyma.us అనే వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉండగా.. ఈ రేట్ చూసి అవాక్ అవుతున్నారు జనాలు. అంత ఖరీదు టీ షర్ట్ ఎలా ఇస్తారంటూ నెట్టింట అమర్ దీప్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. గత ఎపిసోడ్స్ లో శోభాశెట్టి సైతం నాగార్జున షర్ట్ ను అడిగింది. అయితే నాగార్జున అప్పుడు కూడా నవ్వి వదిలేశాడు. ఇక వీకెండ్‌లో శోభాని ఎలిమినేట్ చేసి పంపేశారు.

శోభా ఎలిమినేట్ అయ్యాక ఆమె కోసం నాగార్జున వేసుకున్న షర్ట్ ను బిగ్ బాస్ నిర్వహకులు పంపించారని తెలుస్తోంది. ఇక అమర్ దీప్ అడిగిన టీ షర్ట్ ను సీజన్ అయ్యాక అమర్ కు ఇస్తారని సమాచారం. వారి కోసమే నాగార్జున రిక్వెస్ట్ చేసి పంపించారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ లవర్స్.. నాగార్జున సార్ గొప్ప మనసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ లో ఆరుగురు ఫైనల్స్ కి వెళ్లారు. వీరిలో ఎవరు విజేత కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











