Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ రివర్స్ గేమ్.. హింట్ ఇచ్చిన నాగార్జున, ఆ కంటెస్టెంట్ పని ఔటేనా!

బిగ్ బాస్ తెలుగు షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో రేటింగ్ సాదించుకుంటూ కొనసాగుతోంది. ఈరోజుతో పదకొండు వారాలు పూర్తి చేసుకోబోతున్న బిగ్ బాస్ షోకు అంతా ఫిదా అయిపోతున్నారు. ముందుగా 14 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపించిన బిగ్ బాస్ నాలుగు వారాల తర్వాత మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపాడు. గతంలో ఎలిమినేట్ అయిన వాళ్లలోంచి మరొకరిని కూడా బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకువచ్చాడు. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు మరోకొత్త ట్విస్ట్ ఇచ్చారు.

ఇన్నాళ్లూ శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ లకు బిగ్ బాస్ కాస్త ఫేవర్ గా ఉన్నారు. నాగార్జున తీరు చూస్తుంటేనే అది అర్థం అవుతుంది. అంతేకాకుండా శోభాశెట్టి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకునేలోపే ఆమెను ఇంటి కెప్టెన్ చేసి అందరికీ షాకిచ్చాడు బిగ్ బాస్. ఇది చూసిన తర్వాత కావాలనే బిగ్ బాస్ టీం నిర్వాహకులు శోభాశెట్టికి ఫేవర్ గా ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. నాగార్జున కూడా ఆమె విషయంలో అలాగే ప్రవర్తించేవారు. పల్లవి ప్రశాంత్, శివాజిలతో రూడ్ గా వ్యవహరించినప్పుడు మాత్రమే.. బయట వచ్చే నెగిటివిటీని తట్టుకోలేమని నాగార్జున కాస్త గట్టిగా అడిగేవాడు.

Nagarjuna Hint to Bigg Boss Reverse Game on Shobha Shetty Check Details

అంతేకానీ సీరియల్ బ్యాచ్ వాళ్లను ఎప్పుడూ ఏమీ అనలేదు. ముందుగా అంతా అమర్ దీప్ యే విన్నర్ అవుతాడని భావించారు. కానీ పల్లవి ప్రశాంత్ తో అమర్ దీప్ గొడవ పడ్డ తర్వాత ఆయనకు తీవ్రస్థాయిలో నెగిటివిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత క్లియర్ గా అతడిని గెలిపించలేరని అర్థం అయిపోయింది. అలాగే వీరు ముగ్గురూ కలిసి గ్రూపుగా గేమ్ ఆడుతున్నా, గ్రూపుగా ముందే మాట్లాడుకొని ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నా నాగార్జున ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టైటిల్ ఫేవరెట్లపైనే నాగార్జున ఫైర్ అవుతున్నారు.

రైతుబిడ్డతో గొడవ తర్వాత నుంచి అమర్ దీప్ కు గట్టిగానే క్లాస్ పడతుండగా.. శోభాశెట్టి, ప్రియాంక జైన్ లకు మాత్రం ఏమీ అనకుండా వచ్చారు. ఎలాగూ వీరిలో ఒక్కరూ కూడా గెలిచే అవకాశం లేకపోవడంతో మరో సీరియల్ హీరో అంబటి అర్జున్ ను రంగంలోకి దింపారు. ఎలాగైనా సరే గెలిపించాలని బిగ్ బాస్ టీం వాళ్లు ప్లాన్ వేశారు. కానీ ఆయన అంతగా జనాల్లోకి రావట్లేదు. ఇక వీళ్లు ఎలాగూ గెలిచే అవకాశం లేదు అనుకున్నారే ఏమో.. వారిపైనే ఫైర్ అవుతూ బిగ్ బాస్ రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. ముద్దుబిడ్డ శోభాశెట్టిపై నాగార్జున చేసిన కామెంట్లు చూస్తుంటేనే ఈ విషయం అర్థం అయిపోతుంది.

తాజా ఎపిసోడ్ లో శోభాశెట్టి నాగార్జును ఓ ఫిర్యాదు చేసింది. అంబటి అర్జున్ లక్కు వల్లే నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నానని చెప్పాడు సార్ అనగా... అర్జున్ పైనే నాగ్ ఫైర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా నాగార్జున శోభాశెట్టిపైనే ఫైర్ అయ్యాడు. నిజంగానే నువ్వు లక్కు వల్లే ఇక్కడకు వచ్చావు కదమ్మా అంటూ కామెంట్లు చేశాడు. దీంతో శోభాశెట్టి మరింతగా ఏడ్చింది. ఇది చూస్తుంటేనే ఈమె టాప్ -5లోకి కూడా రావట్లేదని అర్థం అవుతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X