Bigg Boss 7 Telugu: నాగార్జున చేతిలో కొత్త అస్త్రం.. కంటెస్టెంట్లకు కష్టాలు.. ఉల్టా పుల్టా అంటే ఇదే!
తరాలు మారుతుండడంతో పాటు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తుండడంతో బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో కూడా వైవిధ్యం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియాలిటీ షోలే వస్తున్నాయి. అయితే, అలా వచ్చిన వాటిలో జనాల మద్దతును అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్ మాత్రమే. అందుకే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని వైవిధ్యంగా నడుపుతున్నారు. ఇక, తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!
ఎలాగైనా సక్సెస్ చేయాలని:మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్‌ను సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. అలాగే, ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. ఇలా మొత్తంగా దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. దీంతో ఆరంభంలోనే ఈ సీజన్‌పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

అంతా ఉల్టా పుల్టాగానే రన్:వాస్తవానికి తెలుగులో ఆరంభ సీజన్లలో వచ్చినట్లుగా ఆరో సీజన్‌లో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. దీంతో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో కొత్త రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లందరూ కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్లు కాదని చెప్పారు. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులను ఇస్తున్నారు.
14 మందిలో ఆమె వెళ్లింది:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 20 మందికి పైగానే కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా దీనికి 14 మంది సభ్యులు మాత్రమే వచ్చారు. ఇప్పుడు మొదటి వారం ముగియడంతో ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. ఫలితంగా 14 మంది సభ్యుల నుంచి ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది.
ఆడియెన్స్ పల్స్ చెప్పేసి:సాధారణంగా బిగ్ బాస్ షోలో ఉండే కంటెస్టెంట్ల గురించి ప్రేక్షకులు ఏమని అనుకుంటున్నారో గతంలో ఎప్పుడూ చెప్పేవారు కాదు. కానీ, ఏడో సీజన్ మొదటి వారంలోనే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆడియెన్స్ వేసిన మార్కులను చూపించారు. తద్వారా ఏ కంటెస్టెంట్ మీద వాళ్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పారు. దీంతో సభ్యుల ఆటలో మార్పులు వచ్చే చాన్స్ ఉంది.
నాగార్జున చేతిలో అస్త్రం:బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్స్ అన్నీ ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఏడో సీజన్ కూడా అదే రీతిలో సాగుతుంది. అయితే, ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా రేటింగ్ ఇవ్వబోతున్నాడట. ఈ విషయాన్ని ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఆట కోసమా? పంపడానికా:ఏడో సీజన్‌లో హోస్ట్ నాగార్జున వీల్ ద్వారా కంటెస్టెంట్లకు రేటింగ్ ఇవ్వబోతున్నాడు. మంచిగా ఆడేవాళ్లకు గ్రీన్, ఏవరేజ్‌గా ఆడేవాళ్లకు ఆరెంజ్, చెత్తగా ఆడేవాళ్లకు రెడ్ కలర్ ఇవ్వబోతున్నారు. అయితే, ఇది కంటెస్టెంట్ల ఆటను మెరుగు పరిచేందుకేనా? లేదా వాళ్లను ఎలిమినేట్ చేయడంలో భాగంగా కూడా ఉంటుందా? అన్న వివరాలను మాత్రం చెప్పకపోవడంతో సస్పెన్స్ నెలకొంది.


Click it and Unblock the Notifications











