వావ్.. మనం స్టైల్ లో బిగ్ బాస్ ప్రోమో వదిలిన నాగార్జున.. 100% ఎంటర్టైన్మెంట్!
అక్కినేని నాగార్జున నెక్స్ట్ బిగ్ బాస్ 4 సీజన్ కి హోస్ట్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ రియాలిటీ షో ఈ సారి హై రేంజ్ లో కిక్కిచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా నాగ్ వరుసగా ఫోటోలను ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇటీవల వావ్.. వావ్.. అంటూ రిలీజ్ చేసిన ప్రోమో కూడా నెటిజన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది.
Recommended Video
మనం స్టైల్ లో నాగార్జున
మనం సినిమాలో అక్కినేని హీరోలు ఏ విధంగా కనిపించారో అందరికి తెలిసిందే. ఇక నాగ్ కూడా అదే తరహాలో ఒకేసారి తండ్రి పాత్రలో కొడుకు పాత్రలో తాతయ్య పాత్రలతో కనిపించి మూడు తారలను గుర్తు చేశాడు. వావ్ అనిపించిన ఈ ప్రోమోలో నాగ్ బిగ్ బాస్ షో రేంజ్ పెరిగేలా రియల్ ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తానని క్లారిటీ ఇచ్చాడు.

స్పెషల్ ఎట్రాక్షన్ గా..
పక్కింట్లోకి దొంగ చూపులు చూడడం ఎందుకు రియల్ ఎమోషన్స్, రియల్ ఫ్రెండ్షిప్, రియల్ ఫైట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఒక్క బిగ్ బాస్ లోనే ఉంటాయని అంటూ 100% రియల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని నాగ్ వివరణ ఇచ్చిన తీరు ప్రోమోను వైరల్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా నాగ్ మూడు పాత్రల్లో కనిపించిన విధానం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఎలాబీటి

ఆ హీరోలు ఒత్తిడికి లోనయినప్పటికీ..
మొదట ఎన్టీఆర్, ఆ తరువాత నాని హోస్ట్ లుగా కొనసాగిన విషయం తెలిసిందే. ఇక గత సీజన్ లో నాగార్జున షోకి మరింత హైప్ క్రియేట్ చేశాడు. యువ హీరోలు కొంత ఒత్తిడికి లోనయినప్పటికి నాగార్జున చాలా జాగ్రత్తగా ఎలాంటి విమర్శలు తనపై రాకుండా చాల కూల్ గా 3వ సీజన్ ని విజయవంతం చేశారు. నాగార్జున హోస్టింగ్ పాజిటివ్ మార్కులు పడటంతో నాలుగవ సీజన్ కి కూడా ఆయనను సెలెక్ట్ చేసిన స్టార్ మా భారీ రెమ్యునరేషన్ కూడా అందిస్తోంది.

కంటెస్టెంట్ లిస్ట్ రెడీ..
ఇక బిగ్ బాస్ 4 మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఆగస్ట్ లాస్ట్ వీక్ లోనే షోపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షోలో కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయ్యింది. వారికి కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి తరలించేందుకు రెడీగా ఉన్నారట. ఇక షో మొదలయ్యే రోజు కూడా మరోసారి కంటెస్టెంట్స్ కి పూర్తిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హౌజ్ లోకి పంపనున్నారు. మరి ఈ సారి ఎలాంటి కంటెస్టెంట్స్ దర్శనమిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











