గత వారంలో 4 కోట్ల మంది వీక్షించారు.. బిగ్ బాస్ రికార్డులపై నాగ్ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ఎలాంటి పరిస్థితుల మధ్య మొదలైందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయం.. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తరుణంలో క్లిష్ట పరిస్థితుల్లో నాల్గో సీజన్ ప్రారంభమైంది. బయటకు వెళ్లే చాన్స్‌లు లేకపోవడం ఇంట్లోనే ఉంటూ టీవీలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తోన్న వీక్షకులను అట్రాక్ట్ చేయొచ్చనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్‌ను ప్రారంభించేశారు. మామూలుగా అయితే జూన్ జూలైలో మొదలు కావాల్సిన షో సెప్టెంబర్ 6న ప్రారంభమైంది.

నాగార్జున కామెంట్స్..

నాగార్జున కామెంట్స్..

ప్రతి వారం కోట్లాదిమంది వీక్షకులకు వినోదం కలిగించడమే అత్యుత్తమ సంతృప్తిగా నిలుస్తుంది. అదీ మహమ్మారి విజృంభణ లాంటి కష్టకాలంలో ఆ బాధను మరిపించేలా ఉంటే మరింత ఆనందంగా ఉంటుందని బిగ్ బాస్ గురించి, దాని రికార్డుల గురించి నాగార్జున వివరించాడు.

జీఈసీలో వాటా..

జీఈసీలో వాటా..

గతంలో విజయవంతంగా మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో తమ సొంత రికార్డులనే అధిగమించి అపూర్వమైన రీతిలో 20+టీవీఆర్‌ (ఎస్‌డీ+హెచ్‌డీ) సాధించడంతో పాటుగా ప్రతి వారం ఆకట్టుకునే ప్రదర్శనతో 4 జీఈసీలలో 42% వాటా (ఎస్‌డీ+హెచ్‌డీ)ను పొందిందని బిగ్ బాస్ టీం వెల్లడించింది.

అత్యత్తుమ సంతృప్తి..

అత్యత్తుమ సంతృప్తి..

ప్రతి వారం కోట్లాదిమందికి వినోదం అందించడం అత్యుత్తమ సంతృప్తిని అందిస్తుంది. మహమ్మారి విజృంభణ లాంటి కష్టసమయంలోనూ ఇలా ఎంటర్టైన్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున అన్నాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గత రికార్డులను తుడిచిపెట్టేసిందని అసలు లెక్కలు నాగార్జున చెప్పాడు.

నాలుగు కోట్లకు పైగా..

నాలుగు కోట్లకు పైగా..


జాతీయస్థాయిలో బిగ్‌బాస్‌ 3 సీజన్‌ సృష్టించిన రికార్డులనూ ఇది అధిగమించిందని, 20+ టీవీఆర్‌తో ఇది బిగ్‌బాస్‌ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచిందని నాగార్జున పేర్కొన్నాడు. గతవారం ఏపీ మరియు తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనమన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
ఫినాలె ఎపిసోడ్..

ఫినాలె ఎపిసోడ్..

గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వీక్షించారు. ఇది అపూర్వం. ఇప్పుడు మేము అత్యంత ఉత్సాహ పూరితమైన దశలో ప్రవేశించాము. ఈ షో యొక్క ఫైనల్‌ మరింత ఆసక్తిగా ఉండబోతుంది. బిగ్‌బాస్‌ సీజన్‌4 ప్రేక్షకులకు నాగార్జున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X