Bigg Boss Telugu 7: ఆ కంటెస్టెంట్‌కి నాగార్జున బంపర్ ఆఫర్... 14వ వారం కెప్టెన్‌గా ఛాన్స్?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక 13వారాలుగా నాన్ స్టాప్ గా అలరిస్తూ వస్తున్న ఈ షో.. మరో రెండు వారాల్లో ముగియనుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ కు అంతా సిద్ధం అయింది. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో అర్జున్ అంబటి ఫైనాలిస్ట్ గా ఎంపిక అయ్యాడు. అంతే కాదు.. ఓ కంటెస్టెంట్ కు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 14వ వారం కెప్టెన్ బాధ్యతలను ఆ కంటెస్టెంట్ కు ఇచ్చాడు. ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 నాగార్జున హోస్టుగా ఇంట్రెస్టుగా సాగుతోంది. ఇక టీఆర్పీ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు దూసుకుపోతుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... 13వారాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మొత్తం ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మిగిలింది 8 మంది కంటెస్టెంట్స్. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది 7 మంది కంటెస్టెంట్స్. ఒక్క అమర్ దీప్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రస్తుతం హౌస్ అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. వీరిలో ఈ వారం మ్యాగ్జిమమ్ శోభా శెట్టి ఎలిమినేట్ కానుందని అంటున్నారు. చూడాలి మరి.
ఇక ఆ విషయం పక్కన పెడితే.. శనివారానికి సంబంధించిన షూట్ ప్రక్రియ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ లో అర్జున్ అంబటి బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఫైనాలిస్ట్ గా నాగార్జున ప్రకటిస్తారు. ఇక కొంత మందికి ఫన్నీ క్లాస్లులు ఇస్తే.. మరి కొంత మందికి సీరియస్ క్లాస్ లు ఇచ్చాడని తెలుస్తోంది. శనివారం ఎపిసోడ్ లో అర్జున్ అంబటి ఒక్కడు సేవ్ అవుతాడు.
ఇక ఈ శనివారం ఎపిసోడ్ లో మరోక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో కెప్టెన్ కావాలని కోరుకున్న అమర్ దీప్ కు నాగార్జున బంపర్ ఆఫర్ ప్రకటిస్తాడు. 14వ వారం కెప్టెన్ గా అమర్ దీప్ ను అనౌన్స్ చేస్తాడు నాగార్జున. దీంతో అమర్ దీప్ చాలా సంతోషిస్తాడని తెలుస్తోంది. ఎన్నాళ్లో నుంచో అమర్ కు కెప్టెన్ అవ్వాలనే ఆశ ఉండేది. అలా నాాగర్జున మొత్తానికి తీర్చాడు.

ఇక 14వ వారం కెప్టెన్ గా అమర్ దీప్ ఎంపిక అయ్యాడు. కానీ ఓ ట్విస్ట్ ఉంది. ఎలాంటి ఇమ్యూనిటీ లేకుండా జస్ట్ కెప్టెన్ గా నియమించారు నాగార్జున. మొత్తానికి అమర్ దీప్ కెప్టెన్ అయ్యాడు. ఇక అమర్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











